సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed by::K.Raghavendra Rao
తారాగణం::N.T.రామారావు,జయంతి,శ్రీదేవి కపూర్,మోహన్‌బాబు,గీత,రావ్‌గోపాల్‌రావ్,
కైకాల.సత్యనారాయణ,అల్లురామలింగయ్య,నాగేష్,చలపతిరావ్,సుత్తివీరభద్రరావ్,జగ్గారావ్.
పల్లవి::
అత్తమడుగు వాగులోన అత్తకొడకో
అందమంత తడిసింది అత్తకొడకో
అందం అంతా తడిసింది అత్తకొడకో
అందమంత తడిసింది అత్తకొడకో
మెత్తంగ హత్తుకో వెచ్చంగ ఆదుకో
మెత్తంగ హత్తుకో వెచ్చంగ ఆదుకో
గుత్తంగ సోకులన్ని సొమ్ము చేసుకో
గుత్తంగ సోకులన్ని సొమ్ము చేసుకో
అత్తమడుగు వాగులోన అత్తకూతురో
అందమంతా తడిసిందా అత్తకూతురో
చీ..ఫో
అత్తమడుగు వాగులోన అత్తకూతురో
అందమంతా తడిసిందా అత్తకూతురో
అడిగింది ఇచ్చుకో ఇచ్చింది పుచ్చుకో
అడిగింది ఇచ్చుకో ఇచ్చింది పుచ్చుకో
కౌగిట్లో సోకులన్ని కాపు కాచుకో
కౌగిట్లో సోకులన్ని కాపు కాచుకో
చరణం::1
కొత్తూరు ఇది కోడె గిత్తూరిది కన్నె ఈడువున్న ఆడాళ్ళ అత్తూరిదీ
ఒత్తిళ్ళివి ప్రేమ పొత్తిళ్ళివి పెళ్ళికానోళ్ళకి అందాక అత్తిళ్ళివి
అల్లుడల్లే ఆల్లుకోకు అప్పుడే
కోడలల్లే రెచ్చిపోకు ఇప్పుడే
అల్లుడల్లే ఆల్లుకోకు అప్పుడే..కోడలల్లే రెచ్చిపోకు ఇప్పుడే
కౌగిలింతలోనె నువ్వు ఇల్లు కట్టుకో
పడుచు వన్నె పడకటింటి తలుపు తీసుకో
అందం అంతా తడిసింది అత్తకొడకో అందమంతా తడిసిందా అత్తకూతురో
మెత్తంగ హత్తుకో వెచ్చంగ ఆదుకో అడిగింది ఇచ్చుకో ఇచ్చింది పుచ్చుకో
గుత్తంగ సోకులన్ని సొమ్ము చేసుకో కౌగిట్లో సోకులన్ని కాపు కాచుకో
చరణం::2
పొత్తూరిది పిల్ల పొందూరిది అ..చెయ్యేస్తే అందాలు చిందూరిది
గిల్లూరిది నాకు పెళ్ళూరు ఇది ముద్దు మురిపాల నా మూడు ముళ్ళూరిది
కన్నెసోకు కట్నమిచ్చినప్పుడే..ఆ కట్నమేదో నువ్వు తేల్చినప్పుడె
కన్నెసోకు కట్నం ఇచ్చినప్పుడే..ఆ కట్నమేదో నువ్వు తేల్చినప్పుడె
కలవరింతలు అన్ని నాకు కౌలికి ఇచ్చుకో
చిలిపి తలపు వలపు నాకు సిస్తు కట్టుకో
అత్తమడుగు వాగులోన అత్తకూతురో అందం అంతా తడిసింది అత్తకొడకో
అడిగింది ఇచ్చుకో ఇచ్చింది పుచ్చుకో మెత్తంగ హత్తుకో వెచ్చంగ ఆదుకో
కౌగిట్లో సోకులన్ని కాపు కాచుకో గుత్తంగ సోకులన్ని సొమ్ము చేసుకో
No comments:
Post a Comment