Friday, June 20, 2014

నా పేరే భగవాన్--1976



















సంగీతం::చక్రవర్తి
రచన::సినారె
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::రామకృష్ణ,మంజుల,ప్రభాకర్ రెడ్డి,జయమాలిని, సత్యనారాయణ 

పల్లవి::

మన్ని౦చుమా ప్రియా మన్నించుమా 
మరుమల్లె నల్లగా ఉంటే..చిరునవ్వు చేదుగా ఉంటే
ఆ తప్పు నాది కాదంటే..మన్ని౦చుమా ప్రియా మన్నించుమా 

చరణం::1

నా కంటి కులుకులలోన..నీ కలలు చెదురుతు వుంటే
నా కాలి చిందులలోన..నీ గుండె నలుగుతు వుంటే
సగము రేయి రగలిపోయి..సేగలు గా మారిపోతుంటే
ఆ తప్పు నాది కాదంటే..మన్ని౦చుమా ఆ ఆ
మన్ని౦చుమా ప్రియా మన్నించుమా

చరణం::2

ఆలనాటి బాసలన్నీ సెలఏటి రాతలైతే
కుసుమించు ఆశలన్నీ వసివాడి రాలిపోతే
పెదవి వణికీ మధువు తోణికీ హృదయమే తూలి పొతుంటే
ఆ తప్పు నాది కాదంటే..మన్ని౦చుమా..ఆ..ఆ..ఆ
మన్ని౦చుమా ప్రియా మన్నించుమా
మరుమల్లె నల్లగా ఉంటే..చిరునవ్వు చేదుగా ఉంటే
ఆ తప్పు నాది కాదంటే..మన్ని౦చుమా ప్రియా మన్నించుమా 

No comments: