సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::V.రామకృష్ణ, P.సుశీల
తారాగణం::అక్కినేని,శారద,ప్రభ,G.వరలక్ష్మి,జయమాలిని,సత్యనారాయణ,
కాంతారావు,అల్లు రామలింగయ్య
పల్లవి::
ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో
ఎదురుగా..నీవుంటే
చరణం::1
నీవాలు కన్నులలోన నీలాల రాగాలెన్నో
నీవాలు కన్నులలోన నీలాల రాగాలెన్నో
నీ చిగురు మోవిపైన సిరికెంపుల రాగాలెన్నో
నీ చిగురు మోవిపైన సిరికెంపుల రాగాలెన్నో
నిత్యవసంతుడు నీడగవుంటే
నిత్యవసంతుడు నీడగవుంటే..చిత్రవర్ణ రాగాలెన్నో
ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో
ఎదురుగా..నీవుంటే..ఏఏఏ
చరణం::2
కమల రమణి విరమూయునులే అరుణోదయ వేళలో
కలువ చెలువ తెరతీయునులే చంద్రోదయ వేళలో
కమల రమణి విరమూయునులే అరుణోదయ వేళలో
కలువ చెలువ తెరతీయునులే చంద్రోదయ వేళలో
వలచిన హృదయం..పులకించునులే
వలచిన హృదయం పులకించునులే
చెలి వలపుల జోలలో..ఓఓఓ
ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో
ఎదురుగా..నీవుంటే..ఏ
చరణం::3
మనసైన పందిరి కోసం మరుమల్లె తీగసాగె
మనసైన పందిరి కోసం మరుమల్లె తీగసాగె
సెలయేటి కలయిక కోసం కడలిరేడు తానెదురేగె
సెలయేటి కలయిక కోసం కడలిరేడు తానెదురేగె
ఆ అల్లికలో..ఆ కలయికలో
ఆ అల్లికలో ఆ కలయికలో..అనురాగ వీణ మ్రోగె
ఎదురుగా నీవుంటే..ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో..ఎదురుగా నీవుంటే
No comments:
Post a Comment