Saturday, January 05, 2013

చందన--1974


సంగీతం::రమేష్‌నాయుడు    
రచన::సినారె
గానం::S.P.బాలు  
తారాగణం::జయంతి, సత్యనారాయణ,రాజబాబు,నిర్మల,రంగనాధ్,త్యాగరాజు   

పల్లవి::

చిలక పచ్చని కోనలో..ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచి నట్టుంది..ఏ మువ్వలో పిలిచినట్టుంది    
చిలక పచ్చని కోనలో..ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచి నట్టుందీ..ఏ మువ్వలో పిలిచినట్టుందీ   

చరణం::1

ఆ చిలక జంట ఊసులు..ఏ వలపుల గుసగుసలో
ఆ చిలక జంట ఊసులు..ఏ వలపుల గుసగుసలో 
ఈ కన్నెగాలి కదలికలు..ఏ గాజుల గలగలలో
ఏ గాజుల...గలగలలో
చిలక పచ్చని కోనలో..ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచి నట్టుందీ..ఏ మువ్వలో పిలిచినట్టుందీ   

చరణం::2

రేరాణి పారాణిలో..సూరీడు కరిగిపోవునో
రేరాణి పారాణిలో..సూరీడు కరిగిపోవునో
ఏ రాణి నీలవేణిలో..నా మనసే ఒదిగిపోవునో 
మనసే...ఒదిగిపోవునో   
చిలక పచ్చని కోనలో..ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచి నట్టుందీ..ఏ మువ్వలో పిలిచినట్టుందీ

No comments: