Thursday, January 01, 2009

దేవుడు చేసిన మనుషులు--1973

సంగీతం::రమేష్‌నాయుడు 
రచన::శ్రీశ్రీ 
గానం::ఘంటసాల,S.P.బాలు 
తారాగణం::N.T.రామారావు,కృష్ణ,S.V.రంగారావు,జయలలిత,విజయనిర్మల,కాంచన. 

పల్లవి

దేవుడు చేసిన..మనుషుల్లారా
మనుషులు చేెసిన..దేవుళ్ళారా
వినండి దేవుడి గోల..కనండి మనుషుల లీల 
వినండి దేవుడి గోల..కనండి మనుషుల లీల
ఎంతో గొప్పవి మన ఆచారాలు..స్వార్థపరుల కవి అవకాశాలు 
దేవుడు చేసిన మనుషుల్లారా..మనుషులు చెసిన దేవుళ్ళారా 
వినండి దేవుడి గోల...కనండి మనుషుల లీల

చరణం:1

విజ్ఞేశ్వరుడు వరదాయకుడన్నారూ
ఈ పెద్దలందరు వినాయకుడు మా నాయకుడన్నారూ
పాపాలను ఉండ్రాళ్ళుగ చేసి మోసాలను జిళ్ళేళ్ళుగ పోసి 
పాపాలను ఉండ్రాళ్ళుగ చేసి మోసాలను జిళ్ళేళ్ళుగ పోసి
ఇలవేలుపుగా ఊరేగించారూ..ఈ మహానుభావులు 
ప్రజల కళ్ళకే గంతలు..కట్టారూ
వినండి దేవుడి గోల..కనండి మనుషుల లీల 
ఎంతో గొప్పవి మన ఆచారాలు..స్వార్థపరుల కవి అవకాశాలు     
దేవుడు చేసిన మనుషుల్లారా..మనుషులు చేసిన దేవుళ్ళారా 
వినండి దేవుడి గోల...కనండి మనుషుల లీల

చరణం::2

నాటి గణపతికి పొట్టపగిలితే రాలెను ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు 
నేటి గణపతికి బొజ్జపగిలితే రాలును రత్నాలు రత్నాలు
నాటి గణపతికి పొట్టపగిలితే రాలెను ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు 
నేటి గణపతికి బొజ్జపగిలితే రాలును రత్నాలు రత్నాలు
పాపం బద్ద్లు కావాలీ..ఈ..మోసం బైటికి రావాలీ..ఈ 
పాపం బద్దలు కావాలీ..ఈ..మోసం బైటికి రావాలీ..ఈ
పాపం బద్దలు చేయాలీ..మోసం బైటికి తియ్యాలీ 
పాపం బద్దలు చేయాలీ..మోసం బైటికి తియ్యాలీ 

No comments: