సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,పిఠాపురంనాగేశ్వరరావు
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,చంద్రకళ,S.V.రంగారావు,సూర్యకాంతం,గుమ్మడి
పల్లవి::
ఓ మల్లయ్యగారి యల్లయ్యగారి..కల్లబొల్లి బుల్లయ్యో
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
ఓ మల్లయ్యగారి యల్లయ్యగారి కల్లబొల్లి బుల్లయ్యో
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
చరణం::1
గట్టులు కొట్టి పొలం కలుపుకొంటాడూ..ఒక బుల్లెయ్యా
పొట్టలు కొట్టి దినం గడుపుకుంటాడూ..ఒక యెల్లయ్యా
ఓ..చిన్నవాళ్ళ రెక్కల కష్టం ఇక్కడ దోస్తాడూ..ఒహో హో
ఆ బుల్లయ్యే పెద్దవాళ్ళకు కట్టలు కట్టలు అక్కడ ఇస్తాడూ
బుల్లెయ్యా...అక్కడ ఇస్తాడూ
ఓ మల్లయ్యగారి యల్లయ్యగారి..కల్లబొల్లి బుల్లయ్యో
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
చరణం::2
ప్రతి ఒకడూ...తిన మరిగిన వాడూ
ప్రజల పేరే చెబుతుంటాడూ..వహ్ వా వరే వా
నిలదీసి నీ ప్రజలెవరంటే..నిన్నూ కాస్త తినమంటాడూ
అహ...చంపుకు తింటాడూ
గోడమీద పిల్లిలాగా..బుల్లెయ్యుంటాడూ
దొంగలు దొంగలూ..దొంగలు దొంగలు
ఊళ్ళు పంచుకుని...దొరలైపోతుంటే
వాటా దొరకని వాడూ..వేరే పార్ఠీ పెడతాడూ
ఓ.అసలు పార్ఠీ నాదీ.నాదని వాళ్ళల్లరి పడుతుంటే
గోడమీద పిల్లిలాగా బుల్లెయ్యుంటాడూ..అహ కొట్టుకు తింటాడూ
చరణం::3
లింగం మింగిన..బుల్లెయ్యా
గుడిని..మింగేదెపుడయ్యా
లింగ్ లింగ్ లింగ్ లింగ్ లింగ్
లింగ్ లింగ్ లింగ్ లింగ్ లింగ్
లింగం మింగిన..బుల్లెయ్యా
గుడిని..మింగేదెపుడయ్యా
గుడిని లింగాన్ని..గుటుకున మింగె
వాడే...నీ మొగుడయ్యా
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
ఓ మల్లయ్యగారి యల్లయ్యగారి..కల్లబొల్లి బుల్లయ్యో
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
క క క క కల్లయ్యా..బు బు బు బు బుల్లయ్యా
క క క క కల్లయ్యా..బు బు బు బు బుల్లయ్యా
కల్లయ్యా..బుల్లయ్యా..కల్లయ్యా..బుల్లయ్యా
కల్లబొల్లి..బుల్లయ్యో..కల్లబొల్లి..బుల్లయ్యో
కల్లబొల్లి..బుల్లయ్యో..కల్లబొల్లి..బుల్లయ్యో
No comments:
Post a Comment