Thursday, January 09, 2014

అంతస్తులు--1965





సంగీతం::K.V.మహాదేవన
రచన::ఆరుద్ర
గానం::భానుమతి

పల్లవి::

వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న
వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న
పేదోళ్ళ నీతిలో భేదాలు లేవన్న
వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న

చరణం::1

నీరిడిచిపెడితే చేప బతికుంటదా
నీతిడిసిపెడితే మనిషి పరువుంటదా
నీరిడిచిపెడితే చేప బతికుంటదా
నీతిడిసిపెడితే మనిషి పరువుంటదా
నిజమాడితే నిష్టూరమేగా
అయినా పేదలు కలలో కూడా కల్లాకపటలాడరు 
వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న

చరణం::2

లోకాన తాటిచెట్టు ఎత్తైనది
ఆ చెట్టు తలదన్నేది ఒకటున్నది
లోకాన తాటిచెట్టు ఎత్తైనది
ఆ చెట్టు తలదన్నేది ఒకటున్నది
అంతస్తుకి అంతెక్కడుంది
ఏడంతస్తుల మేడకి కూడా పునాది భూమిలో వుండాలి

వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న
పేదోళ్ళ నీతిలో భేదాలు లేవన్న
వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న

No comments: