Monday, November 21, 2011

మనువు మనసు--1973

సంగీత::అశ్వద్థామ
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::ప్రకాశ్.చంద్రకళ, విజయలలిత,కృష్ణకుమారి,చంద్రమోహన్,రమణారెడ్డి,రేలంగి

పల్లవి::

ఆ  ఆ  ఆ  ఆ  ఆ ఆ  ఆ  ఆ  ఆ  ఆ  
మురళీలోలుడు మరులను పొంగించి మోము చూపడాయె 
చేసిన బాసలు రేపిన ఆశలు నీటి రాతలాయె కన్నీటి రాతలాయె 

చరణం::1

ఆ యమునానది ఆ బృందావని అడిగెను నన్నే నీ ప్రియుడేడని

మదిలో చెలరేగే సుడిగాలులతో..ఆ  ఆ  ఆ  ఆ  ఆ   
మదిలో చెలరేగే సుడిగాలులతో బదులు పలికేను ఏమని..ఏడని 
మురళీలోలుడు మరులను పొంగించి మోము చూపడాయె 

చరణం::2

ఎన్నినాళ్ళని రగిలే గుండెను కన్నీళ్ళమాటున దాచేను 

ఎవరికోసమని ఎందుకోసమని కడుపున కార్చిచ్చు మోసేను

No comments: