Sunday, November 25, 2012

మూగప్రేమ--1971




సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::శోభన్ బాబు, వాణిశ్రీ, విజయలలిత,ప్రభాకర రెడ్డి, సూర్యకాంతం,రమణారెడ్డి,G. వరలక్ష్మి

పల్లవి::

వెయ్ వెయ్ వెయ్..చేతిలోన చెయి వెయ్ 
చెయ్ చెయ్ చెయ్..రేయి పగలు ఒకటి చెయ్
నువ్వు నేను వున్నన్నాళ్ళు..నిన్నలన్నీ రేపు చెయ్         
వెయ్ వెయ్ వెయ్ వెయ్..కాలి మీద కాలువెయ్
చెయ్ చెయ్ చెయ్ చెయ్క కన్నెసొమ్ము..కట్నంచెయ్  
ఉన్నన్నాళ్ళు వూపిరాడని..కాపురాన ఊపివేయ్

చరణం::1

లా..లా..లల
నీ కోడె ప్రాయాన..నీ కొంటె గారాన
నే నోడిపోవాలి..నిను గెలుచుకోవాలి
నీ కోడె ప్రాయాన..నీ కొంటె గారాన
నే నోడిపోవాలి..నిను గెలుచుకోవాలి
పరవళ్ళ పరువాన..పంతాన నిలవేసి
బిగి కౌగిలింతలో..పగ తీర్చుకోవాలి    
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
వెయ్ వెయ్ వెయ్ వెయ్..కాలి మీద కాలువెయ్
చెయ్ చెయ్ చెయ్ చెయ్..రేయి పగలు ఒకటి చెయ్
ఉన్నన్నాళ్ళు వూపిరాడని కాపురాన..ఊపివేయ్

చరణం::2
  
తొలిమోజు మొగ్గతో..ప్రతిరోజు పుట్టాలి
నులి వెచ్చనీ రేయి..పెనవేసుకోవాలి
తొలిమోజు మొగ్గతో..ప్రతిరోజు పుట్టాలి
నులి వెచ్చనీ రేయి..పెనవేసుకోవాలి
తొలి ముద్దు ముద్రతో..ప్రతి పొద్దు పూయాలి
పురివిప్పి సరికొత్త ప్రణయాలే..విరియాలి    
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
వెయ్ వెయ్ వెయ్..చేతిలోన చెయి వెయ్ 
చెయ్ చెయ్ చెయ్ చెయ్..రేయి పగలు ఒకటి చెయ్
నువ్వు నేను వున్నన్నాళ్ళు..నిన్నలన్నీ రేపు చెయ్         
వెయ్ వెయ్ వెయ్ వెయ్..కాలి మీద కాలువెయ్
చెయ్ చెయ్ చెయ్ చెయ్..కన్నె సొమ్ము కట్నంచెయ్
ఉన్నన్నాళ్ళు వూపిరాడని..కాపురాన ఊపివేయ్

No comments: