సంగీతం::S.P.కోదండపాణి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::జమున,కృష్ణంరాజు,కృష్ణకుమారి, నాగభూషణం,చంద్రమోహన్,జయ,
అల్లు రామలింగయ్య.
పల్లవి::
తీగకు పువ్వే అందం..గూటికి గువ్వే అందం
ఈ ఇంటికీ ఎవరందం..నా కంటికీ ఎవరందం
ఓ బాబూ నీవేరా..నా బాబూ నీవేరా
చరణం::1
కారుచీకటి ముసిరే వేళ..వేగుచుక్కే వెలుగూ
మండుటెండలు కాల్చేవేళ..వాన చినుకే వరమూ
కారుచీకటి ముసిరే వేళ..వేగుచుక్కే వెలుగూ
మండుటెండలు కాల్చేవేళ..వాన చినుకే వరమూ
ఇన్నాళ్ళు మూగవోయిన..ఈ తల్లి జీవితాన
ఇన్నాళ్ళు మూగవోయిన..ఈ తల్లి జీవితాన
అందాల నీ చిరునవ్వే..ఆశాకిరణం
తీగకు పువ్వే అందం..గూటికి గువ్వే అందం
ఈ ఇంటికీ ఎవరందం..మా కంటికీ ఎవరందం
ఓ బాబూ నీవేరా..నా బాబూ నీవేరా
చరణం::2
అమ్మ పాట వింటుంటే..అన్నీ మరచి చూశావూ
నాన్న పిలుపే విన్నావంటే..నన్ను కూడా మరిచేవూ
అమ్మా..నాన్న ఏడమ్మా ?
ఓ నాన్న నీ కొరకైనా..మీ నాన్న రావాలీ
ఓ నాన్న నీ కొరకైనా..మీ నాన్న రావాలీ
ఇద్దరినీ చూస్తూ నా..ముద్దులన్నీ తీరాలీ
తీగకు పువ్వే అందం..గూటికి గువ్వే అందం
ఈ ఇంటికీ ఎవరందం..మా కంటికీ ఎవరందం
ఓ బాబూ నీవేరా..నా బాబూ నీవేరా
No comments:
Post a Comment