Friday, October 29, 2010

ఇంటికి దీపం ఇల్లాలు--1961




సంగీతం::విశ్వనాథన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.B..శ్రీనివాస్
Film Directed By::T.R.Ramanna
తారాగణం::N.T..రామారావు,జగ్గయ్య,జమున,B.సరోజాదేవి,నాగయ్య,కన్నాంబ,రేలంగి,గిరిజ,రమణారెడ్డి,E.V.సరోజ,K.మాలతి.

పల్లవి::

కాపలా..ఆ ఆ ఆ
కాపలా..ఆ ఆ ఆ
కాపలా..ఆ ఆ ఆ

ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ
బంధాలన్నీ..నీకేలా
ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ
బంధాలన్నీ..నీకేలా
ఈ బంధాలన్నీ..నీకేలా 
బంధాలన్నీ..నీకేలా

చరణం::1 

తనువుకు ప్రాణం..కాపలా 
మనిషికి మనసే..కాపలా 
తనువును వదిలి తరలే..వేళ 
తనువును వదిలి తరలే..వేళ 
మన మంచే..ఏఏఏ..మనకు కాపలా..ఆఆఆ   

ఎవరికి ఎవరు కాపలా..ఆ
బంధాలన్నీ..నీకేలా

చరణం::2 

కంటికి రెప్పే కాపలా 
కలిమికి ధర్మం కాపలా 
కలిమి సర్వము తొలగిన వేళ 
పెట్టినదేరా..ఆఆ..గట్టి కాపలా

ఎవరికి ఎవరు కాపలా..ఆ 
బంధాలన్నీ..నీకేలా

చరణం::3 

చిన్నతనాన తల్లి కాపలా 
వయసున వలచిన వారు కాపలా 
ఎవరి ప్రేమకు నోచని వేళ 
కన్నీరేరా..ఆఆ..నీకు కాపలా
కన్నీరేరా..నీకు కాపలా

ఎవరికి ఎవరు కాపలా..ఆ 
బంధాలన్నీ..నీకేలా
ఎవరికి ఎవరు కాపలా..ఆ 
బంధాలన్నీ..నీకేలా
ఈ బంధాలన్నీ..నీకేలా 
బంధాలన్నీ..నీకేలా

No comments: