Saturday, September 29, 2012

మధురమీనాక్షి--1989





సంగీతం::M.S. విశ్వనాధన్
రచన::రాజశ్రీ
గానం::వాణీజయరాం

పల్లవి::

దేవీ త్రిభువనేశ్వరీ..దేవీ త్రిభువనేశ్వరీ 
గౌరీ శ్రీ రాజ రాజేశ్వరీ..మధురాపురి విభుని
మనసున మురిపించ..మహి వెలసిన తల్లివే
నీవు మణిమయ తేజానివే..దేవీ త్రిభువనేశ్వరీ
గౌరీ శ్రీ రాజ రాజేశ్వరీ..శ్రీ రాజ రాజేశ్వరీ..ఈ..ఈ

చరణం::1

చిరునవ్వు భువికెల్ల ఆనందమే
చిందించు కరుణార్ధ్ర మకరందమే
చిరునవ్వు భువికెల్ల ఆనందమే
చిందించు కరుణార్ధ్ర మకరందమే
చరితార్ధులను చేయు నీ చరణమే
సకలార్ద విజ్ఞాన సందోహమే

దేవీ త్రిభువనేశ్వరీ..గౌరీ శ్రీ రాజ రాజేశ్వరీ
శ్రీ రాజ రాజేశ్వరీ..ఈ..ఈ

చరణం::2

భక్త తతికెల్ల శక్తివై నిలుచు ముక్తి దాత నీవే
తక్క తకధీంత తక్క తకఝంత తకట తఝుణు తకతా
నీ దర్శన భాగ్యానికి కాచేనట వేచేనట ఈ జగమే 
తద్దింతక తఝ్ఝుంతక తద్దింతక తఝ్ఝుంతక తకఝణుతా 
పరాకేల జగన్మాత దిగంతాల మొరాలించు దేవతవే 
తఝంతంత తఝంతంత తఝంతంత తఝంతంత తకధిమిత 
నీతి నిలుపుటకు కూర్మి నెరపుటకు పృథివిపై నీవు వెలసితివే 
తకిట తకధీంత తకిట తకధీంత తకిట తకధీంత తకఝణుత 
దేవీ మాతా జగతీ నేతా కల్పకవల్లి 
తకఝం తఝణం తకఝం తఝణం తరికిటతోం తరికిటతోం 
ముద్దులు చిందే ముచ్చటలొలికే మోహన రూపిణి సుహాసిని 
తాంతక ధీంతక తోంతక నంతక తాంతక ధీంతక తధింతత 
నీ పద యుగములు నమ్మిన వారికి ఆశ్రయమీయవె విలాసిని 
తకధిమి తకఝణు తకధిమి తకఝణు తకధిమి తకఝణు తధీంతత 
తద్ధీంతరికిట తద్ధీంతరికిట తద్ధీంతరికిట తద్ధీంతరికిట  
తద్ధీంతరికిట తద్ధీంతరికిట తద్ధీంతరికిట తద్ధీంతరికిట
చూపులు మోహనం నగమే చందనం 
అభయం జగతికే

దేవీ త్రిభువనేశ్వరీ..గౌరీ శ్రీ రాజ రాజేశ్వరీ
శ్రీ రాజ రాజేశ్వరీ..ఈ..ఈ

No comments: