Thursday, September 30, 2010

డాక్టర్‌ బాబు--1973























సంగీతం::T. చలపతిరావు
రచన::మోదుకూరి జాన్సన్
గానం::మాధవపెద్ది సత్యం

పల్లవి::

ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 
దొరలకూ ద్రోహులకూ దొరకని నేనా
తుఛ్ఛులకూ లుఛ్ఛాలకు లొంగని నేనా   
ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 

చరణం::1

చట్టాన్నొక కోటుగా
సంఘాన్నొక బూటుగా
న్యాయాన్నీ థర్మాన్నీ
లాల్చీ బనియన్లుగా
వేషాలే వేస్తారే
మోసాలే చేస్తారే
వాళ్ళంతా దొరలా..ఆయ్నే
ను నేనా దొంగను           
ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 

చరణం::2

వడ్డీ పేరుతో ప్రాణం
పిండుకునే పుండాకోర్లు
దేముని పేరుతో డబ్బును
దండుకునే దగాకోర్లు
అబలల శీలాల్నీ అణాపైసలకు అమ్మే 
అధమాధములు
వాళ్ళంతా దొరలా..ఆయ్నే
నేను నేనా దొంగను     
ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 

చరణం::3

దొంగెవరో దొర ఎవరో
తేలక పోతుందా
ఈ చీకటి తొలగిపోయి
వెలుగు రాకపోతుందా
కన్నబిడ్డ దగ్గరై
కన్నీరే దూరమై
కలకాలం పండగలా
గడవక పోతుందా
ఆ రోజు రాకపోతుందా     
ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 
ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 

No comments: