Wednesday, August 22, 2012

రాజా విక్రమార్క--1990




సంగీతం::రాజ్-కోటి 
రచన::వేటూరి
గానం::S.P.బాలు,K.S.చిత్ర

పల్లవి::

భళా ఛాంగు భళా..మహ రాజు కళా
దొరికావు గురో..దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే..వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే..నీకు పిడే బాజా
భళా ఛాంగు భళా..మహ రాజు కళా
దొరికావు గురో..దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే..వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే..నీకు పిడే బాజా
భళా ఛాంగు భళా..మహ రాజు కళా
దొరికావు గురో..దొంగోళ్ళ దొరో

చరణం::1

ఓఓహోహోహో..ఓఓఓ ఓహోహో..
నీ గొప్పగనీ కప్పలుగా కమ్ముకునే వాళ్ళూ
నీ లప్ప గనీ చాపకిందా చేరుకునే నీళ్ళూ 
నీ గొప్పగనీ కప్పలుగా కమ్ముకునే వాళ్ళూ
నీ లప్ప గనీ చాపకిందా చేరుకునే నీళ్ళూ
అసలెసరెడతారు..కసి కసి బుస గొడతారూ
పదముల బడతారూ..తమ పదవికి పెడతారూ

భళా ఛాంగు భళా..మహ రాజు కళా
దొరికావు గురో..దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే..వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే..నీకు పిడే బాజా
దిగ్గో దిగ్గో దగా దగా ఏలికా
లెగ్గో లెగ్గో..ఎగా దిగా ఏలకా

చరణం::2

మారాజువని మంగళమే పాడగ వచ్చాము
రారాజువనీ రంగు సిరీ రంభను తెచ్చాము 
మారాజువని మంగళమే పాడగ వచ్చాము
రారాజువనీ రంగు సిరీ రంభను తెచ్చాము 
నీది కోలాహలం కోటా..మాది హాలాహలం ఆటా
పడతది ఉరితాడు తమ పరువుకి చెవుతాడు

భళా ఛాంగు భళా..మహ రాజు కళా
దొరికావు గురో..దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే..వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే..నీకు పిడే బాజా
భూతా ప్రేతా పిశాచాల ఏలికో
ఏతా వాతా శ్మశానాలు ఏలుకో

చరణం::3

నీ గద్దె చూస్తే కనకం నీ బుద్ధి చూస్తే శునకం
నువ్వు చేసుకున్న పాపం నీ నెత్తి కింద దీపం
నీ గద్దె చూస్తే కనకం నీ బుద్ధి చూస్తే శునకం
నువ్వు చేసుకున్న పాపం నీ నెత్తి కింద దీపం
గతి మాదాకోళం నీకూ అది వేళాకోళం మాకు
యముడిక దిగుతాడు నీ మొగుడిక అవుతాడూ

భళా ఛాంగు భళా..మహ రాజు కళా
దొరికావు గురో..దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే..వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే..నీకు పిడే బాజా
భళా ఛాంగు భళా..మహ రాజు కళా
దొరికావు గురో..దొంగోళ్ళ దొరో

No comments: