Saturday, August 31, 2013

నాకు పెళ్ళం కావాలి--1987

సంగీతం::వసూరావు
రచన::ఆత్రేయ 
గానం::P.సుశీల
తారాగణం::చంద్రమోహన్,కల్పన,రాజేంద్రప్రసాద్,నూతనప్రసాద్,శాంతిప్రియ,నిర్మలమ్మ,J.V.రమణమూర్తి,కోటశంకరరావు. 

పల్లవి:: 

సా......పా......సా..
ఆ.......ఆ.......ఆ..
ఎవ్వరో అతనెవ్వరో ఒకడొస్తాడూ..పిల్లనీ చూడాలనీ త్వరపడతాడు
మెల్లగా అడుగేసినా దడ పుట్టెనేందుకో..ఓరగా ఎటు చూసినా ఒనుకొచ్చేనేందుకో
పిల్లకి పెళ్ళి చూపులూ..పాఠం నేర్పని పరీక్షలూ

సనిపద సనిపద సనిపగరిసని స్దరిగప సరిగప  
రిగపని రిగపని  

చరణం::1

మనిషే ఎవరని తెలియని వాని..మనసున వున్నా రూపమేమిటో 

హంసల నడకల కోయిల పాటల సతి కావాలని కోరెనో
రంభా వూర్వశి మేనక మేని అందం కోసం వెతికేనో
ని స ని ప ప ని ప గ గ ప గ రి రి గ రి స
ని స రి గ ప స రి గ ప ని 

ఎవ్వరో అతనెవ్వరో ఒకడొస్తాడూ..పిల్లనీ చూడాలనీ త్వరపడతాడు

చరణం::2

ఆడది వెతికే అందం ఒకటే వంచన లేని మంచితనాన్నేని

అప్పుడు మగడూ వామనుడైనా..హిమాలయంలా కనపడును
ఆకారంలో ఎలాగున్నా మన్మధుడల్లే వుంటాడూ....

No comments: