Tuesday, August 23, 2011

దొంగ మొగుడు--1987





సంగీతం::చక్త్రవర్తి 
రచన::సిరివెన్నెల  గారు
గానం::S.P.బాలు, P.సుశీల 

ఈ చెంపకు..సెలవీయకు 
ఈ పెదవిని..వదిలేయకు 
చాలని అనకు..రాతిరి మనకు 
మోహాలు సంకెళ్ళు..విడిపోనీకు..హా
ఈ చెంపకు..సెలవీయకు 
ఈ పెదవిని..వదిలేయకు

చరణం::1

నీ వేళ్ళు చేసే అల్లరి 
కుచ్చెళ్ళు పాడే పల్లవి 
తుఫాను రేగే ముందర 
ముస్తాబు దేనికి దండగ 
కంటి చూపు చీర కట్టాలి ఒంటిని 
కంచి పట్టు చీర జారాలి నేలనీ 
ఈ వేడీలో వాడనీ..ఈ గాలినే పూలనీ 
గండి పడ్దది నింగి చెరువుకి 
వెండి వెన్నెల పొగుతున్నదీ 
గోరింత తుళ్ళింత వెల్లువయ్యేలా..హోయ్

ఈ చెంపకు..సెలవీయకు 
ఈ పెదవిని..వదిలేయకు

చరణం::2

పై పైకి రాకు సూర్యుడా..పొద్దంటే మాకు చేదురా 
తెల్లారుతుందా తీరక..అల్లాడుతోందీ కోరికా 
కక్ష కట్టి వచ్చి..మా తలుపు తట్టకు 
గెలుపు వలలు తెచ్చి..మా తలలు పట్టకు 
ఈ రేయిని ఆగనీ..ఈ హాయినీ సాగనీ 
పాలపుంతలో పూల వేడుక..కౌగిలింతలో ఇలకు జారగా 
తాపాల దాహాలు..తీరిపోయేలా హోయ్ 

ఈ చెంపకు..సెలవీయకు 
ఈ పెదవిని..మ్మ్ మ్మ్ మ్మ్ హా
చాలని అనకు..ఆ..హా..రాతిరి మనకు 
మోహాలు సంకెళ్ళు..విడిపోనీకు..హోయ్ 

No comments: