Thursday, August 11, 2011

ముద్దుల కృష్ణయ్య--1986




సంగీతం::K.V. మహదేవన్
రచన::D.సినారె
గానం::S.P.బాలు, P.సుశీల

పల్లవి::

సురుచిర సుందర వేణి
మధుమయ మంజుల వాణి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సురుచిర సుందర వేణి 
మధుమయ మంజుల వాణి
ప్రణయ వేదమాలపించనీ
హృదయరమ్య మదనసీమ పాలించనీ
నిను లాలించనీ

సురుచిర సుందర వేణి
మధుమయ మంజుల వాణి
ప్రణయ వేదమాలపించనీ 
హృదయరమ్య మదనసీమ 
పాలించనీ..నిను లాలించనీ

సురుచిర సుందర వేణి
మధుమయ మంజుల వాణి

చరణం::1

గలభాస్వర లలితస్వర పదసుందర 
లయబంధుర చలనమ్ములో సాగిపోనీ
రజనీకర హిమశీకర సుమనోహర 
కిరణాంతర రసడోలలో ఊగిపోనీ 
జలరాశులన్ని చెలరేగినా
విలయాగ్నులన్నీ విషమించినా
జగదేక వీరుడనై ఏలుకొని..నిన్నేలుకోనీ

సురుచిర సుందర వేణి 
మధుమయ మంజుల వాణి
ప్రణయ వేదమాలపించనీ
హృదయరమ్య మదనసీమ 
పాలించనీ నిను లాలించనీ

సురుచిర సుందర వేణి
మధుమయ మంజుల వాణి

చరణం::2

ప్రతి దృశ్యం శత పత్రం
ప్రతి వచనం శృతి రుచిరం
బ్రతుకంత ప్రసరించిపోనీ

ప్రతి కణమొక మణిముకురం
ప్రతి కలియిక మధుమధురం 
ప్రణయాభ్ధి ఉప్పొంగిపోనీ

పలనాటి వీరా కళభాషణా
నా బాలచంద్రా నవ మోహనా 
మాంచాలనై నేనుండి పోనీ మది నిండిపోనీ

సురుచిర సుందర వేణి
మధుమయ మంజుల వాణి
ప్రణయ వేదమాలపించనీ
హృదయరమ్య మదనసీమ 
పాలించనీ నిను లాలించనీ
అహాహాహా అహాహాహహ
అహాహాహా అహాహాహహ

No comments: