Thursday, August 01, 2013

మా బంగారక్క--1977
























chimmata khajana maro Animutyam tappaka vinandii ii paata 
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=21006

సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి 
గానం::రామకృష్ణ,P.సుశీల
తారాగణం::మురళీమోహన్,సత్యనారాయణ,శ్రీదేవి,రమాప్రభ,అల్లు రామలింగయ్య,నిర్మల 

పల్లవి::

చేత వెన్నా ముద్ద..చెంగల్వాపూదండా
చేత వెన్నా ముద్ద..చెంగల్వాపూదండా
లింగులిటుకు..లింగులిటుకు
తింటే మటుకు గుటుకు గుటుకు
చేత వెన్నా ముద్ద..చెంగల్వాపూదండా

చరణం::1

ఓ చిలకా..రాచిలకా
నిన్ను పట్టేసి పంజరంలో పెట్టేస్తే..ఏం చేస్తావు?
ఏం చేస్తావు..నువ్వేం చేస్తావు?

ఏం చేస్తానా..ఏం చేస్తానా
జువ్వలు పటపట కొరుకుతా..రివ్వున పై పై కెగురుతా
రెప రెప రెప రెప రెప రెప రెప రెప

చేత వెన్నా ముద్ద..చెంగల్వాపూదండా

చరణం::2

ఓ ఏరా..సెలయేరా
నిన్ను గట్టువేసి కదలకుండా కట్టెస్తే..ఏం చేస్తావు
ఏం చేస్తావు..నువ్వేం చేస్తావు?

ఏం చేస్తానా..ఏం చేస్తానా
కస్సున బుస్సున పొంగుతా
గట్టును తెంచుకొని పొర్లుతా
జలజలజలజలజలజల

చేతవెన్నె ముద్ద..చెంగల్వాపూదండా

చరణం::3

ఓ గాలి..ఈ..పైరగాలి
నిన్ను బుడగలోకి ఊదేసి..ముడివేస్తే..ఏం చేస్తావు?
ఏం చేస్తావు..నువ్వేం చేస్తావు?

ఏం చేస్తానా..ఏం చేస్తానా
ఫటాఫటామని పేలుతా..చిటారుకొమ్మల ఊగుతా
చేతవెన్నా ముద్ద..ఆ..చెంగల్వాపూదండా

ఓ యమ్మ..ఓ బుట్టబొమ్మ
నిన్ను ఎవడేనా చినవాడు ఎత్తుకుపోతే ఏం చేస్తావు?
ఏం చేస్తావు..నువ్వేం చేస్తావు?
ఆహా ఆహా

No comments: