సంగీతం::T.V. రాజు
రచన::సినారె
గానం::ఘంటసాల
పల్లవి::
మరదల పిల్ల ఎగిరిపడకు..గడసరి పిల్ల ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా..నా గెలుపే నీ గెలుపు కాదా

చరణం::1
మొగిలిపువ్వులా సొగసుందీ..ఈ..ముట్టుకుంటే గుబులౌతుంది

కోడెత్రాచులా వయసుంది..అది కోరుకుంటే దిగులౌతుంది

ఆ కోపంలో భలే అందముంది..ఆ కోపంలో భలే అందముంది
మరదల పిల్ల ఎగిరిపడకు..గడసరి పిల్ల ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా..నా గెలుపే నీ గెలుపు కాదా
చరణం::2
కసురుకుంటే కవ్విస్తానూ..ఊ..విసురుకుంటే ఉడికిస్తాను

ముక్కు తాడు తగిలిస్తాను..ఆ..మూడుముళ్ళు వేసేస్తాను

ఏనాడైనా నీ వాడ నేను..ఏనాడైనా నీ వాడ నేను
మరదల పిల్ల ఎగిరిపడకు..గడసరి పిల్ల ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా..నా గెలుపే నీ గెలుపు కాదా
No comments:
Post a Comment