Sunday, August 01, 2010

ముహూర్త బలం--1969





















Chimmata khajaanaa Animutyamu paata vinandi http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3516

సంగీతం::K.V. మహదేవన్
రచన::సినారె
గానం::S.P.బాలు, P.సుశీల
తారాగణం::కృష్ణ, జమున,విజయనిర్మల,నాగభూషణం,రాజబాబు,
అల్లు రామలింగయ్య,జ్యోతిలక్ష్మి, రాజేశ్వరి

పల్లవి::

బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోయిందా
బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోయిందా

కోరుకున్న చిన్న దాన్ని గుండెలోన ఏముందో
కొంచెమైన తెలుసుకున్నావా ఆ ఆ ఆ

బుగ్గ గిల్ల గానే సరిపోలేదు
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు
బుగ్గ గిల్ల గానే సరిపోలేదు
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు

నీ కొంగు నా కొంగు ఏకంగా ముడి వేసే
వేళ కోసం వేచి ఉన్నాను ఊ ఊ ఊ

బుగ్గ గిల్ల గానే సరిపోలేదు
గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు

చరణం::1

ముత్యాల పందిరి వేసి..రత్నాల పీట వేసి
బంగారు చేతులతో..బాసికం కడతావా

మనసే ఒక పందిరి చేసి మమతలనే పీట వేసి
మురిపించే చేతులతో..మూడు ముళ్ళు వేస్తానే
నీ జోడు కూడి వస్తానే

బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు

చరణం::2

కన్నె పిల్ల వలపంటే..వెన్నపూస లాంటిది
కాస్త వేడి సోకిందా..కరిగి పోతానంటదీ

చల చల్లని కళ్ళల్లో..మెల మెల్లగా దాచుకుంటే
వెన్న లాంటి ఆ వలపే..వేడి తగలకుంటదీ
నా నీడ లాగ ఉంటదీ

బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే అయిపోయిందా

బుగ్గ గిల్ల గానే సరిపోలేదు
గిలి గిలి గిలి గిలి నవ్వగానే అయిపోలేదు

No comments: