Wednesday, August 03, 2011

పరువు ప్రతిష్ట-- 1963





















సంగీతం::పెండ్యాల
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

విను విను విను నిను వదలను..నిరాశ చేయకు
నడు నడు నడు నా దారిని విడు..చిరాకు చేయకు

చరణం::1

వలచి నేను వెంటబడితె..అదో నేరమా
పిలిచి నీకు బానిసనైతె..యింత కోపమా
పిలిచి నీకు బానిసనైతె..యింత కోపమా
ఆ..పిలువకనే పేరంటానికి..తయారౌదువా?
చిలిపితనం ఆపి మనసు..చిత్తగించవా 

విను విను విను నిను వదలను..నిరాశ చేయకు
నడు నడు నడు నా దారిని విడు..చిరాకు చేయకు

చరణం::2

అనాదిగా ఆడవారు ఇదే మోస్తరు
అలకతోనె కాలమంతా..వృధా చేతురు
అలకతోనె కాలమంతా..వృధా చేతురు
ఆ..అలా అలిగి హృదయము..ఏమో తెలిసికొందురు
ఆకతాయి కుర్రాడైతే..ఆగమందురు 

ఆహ్హా..
విను విను విను నిను వదలను..నిరాశ చేయకు
నడు నడు నడు నా దారిని విడు..చిరాకు చేయకు

చరణం::3

మనసంతా తెలుపుటవలనే..మరీ లోకువా
చెంతచేరి బాసలు నీతో..చేయనీయవా
చెంతచేరి బాసలు నీతో..చేయనీయవా
ఆ..చెంతచేరి తెలుపకపోతే..వూహ తెలియదా
ఎంత దూరమైనా మనసు..నీకు చేరువా 

ఆహ్హా..ఆ..హ్హా..ఆహ్హా..ఓఓహ్హో..హో..
ఆఆఆఆఆఆ..

No comments: