సంగీతం::A.R.రెహ్మాన్
రచన::వేటూరి
గానం::K.J.యేసుదాస్ , చిత్ర
తారాగణం::కృష్ణం రాజు,రాధిక
పల్లవి::
నీలిమబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన
ఎర్ర పొద్దే గుండె పగిలి ఏడ్సేనంట
తోడునీడ లేని గుండె దీపానికి
గాలి వాన సుట్టాలై వచ్చేనంట
ఏ దేవుడీ రాత రాసేననీ
ఆకాశమేఘాలన్ని అడిగేనంట
నీలి మబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన
ఎర్ర పొద్దే గుండె పగిలి ఏడ్సెనంట
తోడు నీడ లేని గుండె దీపానికి
గాలి వాన సుట్టాలై వచ్చేనంట
చరణం::1
పురుడోసినాడే పుట్టింటి పేరు
మెట్టింట దీపమయ్యే ఆడపుట్టక
చీరే సారేరుగా సిరులన్నీ పోసి
పొరుగోళ్ళ పంచనెట్టే సింతచెట్టుగా
విలపించే తలరాతేమో తల్లి కోసమా
తొలి సూరి పిల్లకేమో పేగు దోసమా
మేనమామై పుట్టటమే ఈ మనిసి దోసమా
నీలిమబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన
ఎర్ర పొద్దే గుండె పగిలి ఏడ్సేనంట
తోడునీడ లేని గుండె దీపానికి
గాలి వాన సుట్టాలై వచ్చేనంట
ఏ దేవుడీ రాత రాసేననీ
ఆకాశమేఘాలన్ని అడిగేనంట
నీలిమబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన
ఎర్ర పొద్దే గుండె పగిలి ఏడ్సేనంట
చరణం2::
పానాలు కూడా దానాలు జేసే
అన్నాచెల్లెళ్ళ మధ్య దూరం పెరిగేనా
సొంతోళ్ళు జేసే పంతాల గాయం
సిన్నారి బతుకుల్లోన చిచ్చైపోయెనా
కన్నోళ్ళ నడుపు తీపి కన్నీళ్ళవ్వగా
అయినోళ్ళ ఆదరణేది అందకుండగా
అల్లాడి ఏడ్సేందుకే ఆడజన్మ
నీలిమబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన
ఎర్ర పొద్దే గుండె పగిలి ఏడ్సేనంట
తోడునీడ లేని గుండె దీపానికి
గాలి వాన సుట్టాలై వచ్చేనంట
ఏ దేవుడీ రాత రాసేననీ
ఆకాశమేఘాలన్ని అడిగేనంట
నీలి మబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన
ఎర్ర పొద్దే గుండె పగిలి ఏడ్సేనంట
తోడు నీడ లేని గుండె దీపానికి
గాలి వాన సుట్టాలై వచ్చేనంట
No comments:
Post a Comment