సంగీతం::K.V.మహదేవన్
రచన::సినారె
గానం::P.సుశీల ,S.P.బాలు
తారాగణం::శోభన్ బాబు,జయసుధ, జయప్రద,రాజబాబు,శరత్ బాబు,విజయభాను
పల్లవి::
వేయి దీపాలు నాలోన వెలిగితే
అది ఏ రూపం..నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే
అది ఏ రాగం..ఆ అనురాగం
చరణం::1
ఈ చీకటి కన్నుల వాకిలిలో..ఓ
వెలుగుల ముగ్గులు వేసేదెపుడో
ఆ వెలుగుల మంగళవేదికపై
నా వేణులోలుని చూసేదెపుడో
చూడలేని నీ కన్నులకూ
ఎదురుచూపైనా ఉందొకటి
చూడగలిగే నా కన్నులకు
చుట్టూ ఉన్నది పెనుచీకటి
వేయి దీపాలు నాలోన వెలిగితే
ఏ రూపం..నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే
ఏ రాగం..ఆ అనురాగం
చరణం::2
సుడివడిపోయే జీవితనౌక
కడలితీరం చేరేదెపుడో
కలగా తోచే ఆశారేఖ
నిజమై ఎదురై నిలిచేదెపుడో
వేచి ఉన్న నీ హృదయంలో
రేపటి ఉదయం మెరిసింది
వేగిపోయే నా గుండెలో
గతమే స్మృతిగా మిగిలింది
వేయి దీపాలు నాలోన వెలిగితే
ఏ రూపం..నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే
ఏ రాగం..ఆ అనురాగం
Jeevita Nauka--1977
Music::K.V.Mahadaevan^
Lyrics::Sinaare
Singer's::Suseela , Baalu
CAST::SObhan Baabu,Jayasudha, Jayaprada,Raajabaabu,Sarath Baabu,Vijayabhaanu
:::
veyi deepaalu naalOna veligite
E roopam..nee pratiroopam
kOTi raagaalu naa gontu palikite
E raagam..aa anuraagam
:::1
ee cheekaTi kannula vaakililO..O
velugula muggulu vesedepuDO
aa velugula mangaLavedikapai
naa venulOluni choosedepuDO
chooDaleni nee kannulakoo
eduruchoopainaa undokaTi
chooDagalige naa kannulaku
chuTToo unnadi penucheekaTi
veyi deepaalu naalOna veligite
E roopam..nee pratiroopam
kOTi raagaalu naa gontu palikite
E raagam..aa anuraagam
:::2
suDivaDipOye jeevitanauka
kaDaliteeram cheredepuDO
kalagaa tOche aaSaarekha
nijamai edurai nilichedepuDO
vechi unna nee hrdayamlO
repaTi udayam merisindi
vegipOye naa gunDelO
gatame smrtigaa migilindi
veyi deepaalu naalOna veligite
E roopam..nee pratiroopam
kOTi raagaalu naa gontu palikite
E raagam..aa anuraagam
No comments:
Post a Comment