Monday, March 24, 2014

నీడలేని ఆడది--1974










సంగీతం::సత్యం
రచన::డా.సినారె
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::నరసింహరాజు,సుధీర్,వరప్రసాద్,ప్రభ, ఉమాదేవి,కల్పన,సీతాలత 

పల్లవి::

తొలి వలపే..తొలి వలపే
తియ్యనిదీ..తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది

తొలి వలపే..తియ్యనిదీ
మదిలో..ఎన్నడు మాయనిది

నీ కొరకే దాచినదీ..వేరెవరూ దోచనిదీ
తొలి వలపే..తియ్యనిదీ
మదిలో..ఎన్నడు మాయనిది

చరణం::1

పొగరు సొగసు గల చిన్నది..బిగి కౌగిలిలో ఒదిగున్నది
పొగరు..సొగసు గల చిన్నది..బిగి కౌగిలిలో ఒదిగున్నది
ఈ విసురూ ఎక్కడిది..నీ జతలోనే నేర్చినది

తొలివలపే తియ్యనిదీ..మదిలో ఎన్నడు మాయనిది

చరణం::2

కనులూ కలలూ కలబోయని..నీలో సగమై పెనవేయనీ
కనులూ కలలూ కలబోయనీ..నీలో సగమై పెనవేయనీ
కలకాలం ఈ ప్రణయం..నిలవాలి మనకోసం

తొలి వలపే తియ్యనిదీ..మదిలో ఎన్నడు మాయనిది

చరణం::3

వలచే హృదయం విలువైనదీ..కలిసే బంధం విడిపోనిదీ
అనురాగం..కొనలేనిదీ..అది ఒకటే మన పెన్నిధీ..ఈ

తొలి వలపే తియ్యనిదీ..మదిలో ఎన్నడు మాయనిది

No comments: