సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::సదాశివబ్రహ్మం
గానం::ఘంటసాల, P.లీల
తారాగణం::N.T.రామారావు, సావిత్రి, గిరిజ, రేలంగి, జగ్గయ్య,పేకేటి శివరాం,
C.S.R.ఆంజనేయులు
పల్లవి::
మది ఉయ్యాలలూగే..నవభావాలేవో రేగే
మానసమానందమా..నవభావాలేవో రేగే
మానసమానందమాయెనహొ
మది ఉయ్యాల
ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరి పోవుదమా
ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరి పోవుదమా
మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహో
చరణం::1
తీయని కోరికలూరెను నాలో..తెలియదు కారణమేమో
తీయని కోరికలూరెను నాలో..తెలియదు కారణమేమో
ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా..ప్రణయమిదేనా
ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా..ప్రణయమిదేనా
నూతన యవ్వన..సమయమున
మది ఉయ్యాలలూగే నవభావాలేవో..రేగే మానసమానందమాయెనహో
చరణం::2
చిన్నతనమేలా సిగ్గుపడనేల..మన్ననలెందుకు మనలోనా
చిన్నతనమేలా సిగ్గుపడనేల..మన్ననలెందుకు మనలోనా
ప్రేమలో కరగిపోవుదమా..భేదమే మరచిపోవుదమా
ప్రేమలో కరగిపోవుదమా..భేదమే మరచిపోవుదమా
మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే..మానసమానందమాయెనహో
చరణం::3
ఓ చెలియా మన జీవితమంతా..పున్నమ వెన్నెల కాదా ఆ
ఓ చెలియా మన జీవితమంతా..పున్నమ వెన్నెల కాదా ఆ
రేయి పగలు నే నిను మురిపించి..నిను వలపించి
ప్రేమ జగానికి..కొనిపోనా
మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే..మానసమానందమాయెనహో
మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే..మానసమానందమాయెనహో
No comments:
Post a Comment