సంగీతం::S.P.కోదండపాణి
రచన::దాశరధి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ,శారద, రామకృష్ణ,విజయలలిత,గుమ్మడి,పద్మనాభం
పల్లవి::
ఈశా..ఆ..మహేశా..ఆ..
ఈశా..మహేశా..
అమ్మను ఒకసారి చూపరాదా..రమ్మని నీవైనా చెప్పరాదా
పాపను నాపైనా జాలి లేదా..
ఈశా..మహేశా..
అమ్మను ఒకసారి చూపరాదా..రమ్మని నీవైనా చెప్పరాదా
పాపను నాపైనా జాలి లేదా..
చరణం::1
అమ్మ పాలు తాగలేదూ..అమ్మ ఒడిన ఊగలేదూ
అమ్మ పాలు తాగలేదూ..అమ్మ ఒడిన ఊగలేదూ
కమ్మనైన అమ్మ మాట కలనైనా వినలేదు
కమ్మనైన అమ్మ మాట కలనైనా వినలేదు
అమ్మా..ఆఆ..అమ్మా అమ్మా అని ఎంత పిలిచినా రాదూ
ఈశా..మహేశా..
అమ్మను ఒకసారి చూపరాదా..రమ్మని నీవైనా చెప్పరాదా
పాపను నాపైనా జాలి లేదా..
చరణం::2
ప్రతి పువ్వుకు రెమ్మ ఉందీ..అందరికీ అమ్మ ఉందీ
ప్రతి పువ్వుకు రెమ్మ ఉందీ..అందరికీ అమ్మ ఉందీ
మురిపాలను తేలడా ముద్దు గణపతీ
కొమరయ్యను లాలించగ తల్లి పార్వతీ
లేగ పిలుపు వినగానే గోమాత ఆగునా
కన్నబిడ్డ గోడు విని తల్లి మనసు దాగునా
ఏ పాపం చేసానని ఈ లోపం చేసావూ..ఓ..
ఈశా..ఈశా..మహేశా..మహేశా..ఈశా..మహేశా
No comments:
Post a Comment