Sunday, January 03, 2010

విచిత్ర దాంపత్యం--1971::కానడ::రాగం
























సంగీతం::అశ్వద్ధామ
రచన::సినారె 
గానం::P.సుశీల 
కానడ::రాగం 

పల్లవి::

శ్రీ గౌరి శ్రీగౌరీవే..శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా 

శ్రీ గౌరి శ్రీగౌరీవే..శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా

చరణం::1

సతిగా తన మేను చాలించి పార్వతిగా మరుజన్మ ధరియించి
సతిగా తన మేను చాలించి పార్వతిగా మరుజన్మ ధరియించి
పరమేశునికై తపియించి..పరమేశునికై తపియించి
ఆ హరుమేన సగమై పరవశించిన 

శ్రీ గౌరి శ్రీగౌరీవే..ఏఏ..

చరణం::2

నగకన్యగా తాను జనియించినా..జగదంబయైనది హైమవతి
నగకన్యగా తాను జనియించినా..జగదంబయైనది హైమవతి
సురలోకమున తాను ప్రభవించినా..తరళాత్మమైనది మందాకిని
ఒదిగి ఒదిగి పతిపదములందు..నివసించి యుండు గౌరి
ఎగిరి ఎగిరి పతిసిగను దూకి..నటియించుచుండు గంగ
లలితరాగ కలితాంతరంగ గౌరి..చలిత జీవన తరంగ రంగ గంగ
దవళాంశు కీర్తి గౌరి నవఫేనమూర్తి గంగ
కల్పాంతమైన భువనాంతమైన
క్షతియెరుగని మృతి యెరుగని..నిజమిది 

శ్రీ గౌరి శ్రీగౌరీవే..శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా
శ్రీగౌరి శ్రీగౌరియే..ఏఏ..

No comments: