సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::శ్రీ శ్రీ
గానం::S.P.బాలు
తారాగణం::చిరంజీవి,సుహాసిని
రాజేంద్ర ప్రసాద్,నారాయణరావ్.
పల్లవి::
మనిషే మణిదీపం మనస్సే నవనీతం
మనిషే మణిదీపం మనస్సే నవనీతం
మనిషే మాణిక్యం మెరిసే వైడుర్యం
కన్నులో అనురాగం గుండెలో అనుతాపం
మనిషే మాణిక్యం మెరిసే వైడుర్యం
కన్నులో అనురాగం గుండెలో అనుతాపం
మనిషే మణిదీపం మనస్సే నవనీతం
చరణం::1
ఈమె పేరే మంచితనం ప్రేమ పెంచే సాధు గుణం
ఈమె తీరే స్నేహధనం భారతంత అభరణం
ఈమె పలుకే ముద్దు గొలిపె తేనలొలికే తియ్యదనం
మనిషే మణిదీపం మనస్సే నవనీతం
మనిషే మాణిక్యం మెరిసే వైడుర్యం
కన్నులో అనురాగం గుండెలో అనుతాపం
మనిషే మణిదీపం మనస్సే నవనీతం
చరణం::2
పెళ్ళి పల్లకి హరివిల్లు చుక్కలె అక్షింతలు జల్లు హా
పెళ్ళి పల్లకి హరివిల్లు చుక్కలె అక్షింతలు జల్లు
సంధ్య కెంజాయ పారాణి నల్ల మొబ్బులే సాంబ్రాణి
పిల్ల గాలులే ప్రేక్షకులు దేవదూతలే రక్షకులు
మనిషే మణిదీపం మనస్సే నవనీతం
మనిషే మాణిక్యం మెరిసే వైడుర్యం
కన్నులో అనురాగం గుండెలో అనుతాపం
మనిషే మణిదీపం మనస్సే నవనీతం
చరణం::3
ఎదురు చూచిన తొలి రేయి నుదుట కురులే చెదిరాయి
నిదుర మరిచిన నడి రేయి ప్రియుడి పెదవులు నవ్వాయి
అంతలొనే తెల్లవారి వింత కలలే కరిగాయి
మనిషే మణిదీపం మనస్సే నవనీతం
మనిషే మాణిక్యం మెరిసే వైడుర్యం
కన్నులో అనురాగం గుండెలో అనుతాపం
మనిషే మణిదీపం మనస్సే నవనీతం
No comments:
Post a Comment