Wednesday, December 18, 2013

ఉషాపరిణయం--1961
















సంగీతం::సాలూరి హనుమంతరావు
రచన::సదాశివ బ్రహ్మం
గానం::P.B.శ్రీనివాస్,జమునారాణి
తారాగణం::S.V.రంగారావ్..కాంతారావ్..జమున.

సాకీ::
ఓ..జవరాలా..ఉషాబాలా..
ఎవరో..నను పిలిచేవారెవరో..
నీ మనసే నిను పిలిచినది నీ వయసే
ఆహా..తెలిసే నా మదిలో..నీ రూపమే మెరిసే

పల్లవి::

అదిగో మన ప్రేమ చెలువారు సీమ
పరమానందభరితము కాంచుమా
అదిగో మన ప్రేమ చెలువారు సీమ
పరమానందభరితము కాంచుమా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ..ఏమో..నే పసిదానరా
నీ వశమైతిరా నను దరిజేర్చరా
ఏమో..నే పసిదానరా నీ వశమైతిరా
నను దరిజేర్చరా..ప్రియుడా..ఆ..

చరణం::1

చల్లన నెలరాజు కురిపించె సుధలు
విల్లున వలరాజు సంధించె విరులు
చల్లన నెలరాజు కురిపించె సుధలు
విల్లున వలరాజు సంధించె విరులు

మనమున చెలరేగె నవభావన
మనమున చెలరేగె నవభావన
అనురాగముదయించె నాలోన
అదిగో..ఓ..మన ప్రేమ చెలువారు సీమ

చరణం::2

రావోయి..ఈ..రావోయి..
రావోయి మనోనాయకా..ఆ..
ప్రేమగగనాలలో..మధుర భావాలతో 
ప్రణయ రాజ్యాలు..పాలించి వినోదింపగా
రావోయి..మనోనాయకా..ఆ..

వలచి వలపించే నినుపోలునేమో
చెలిమి లభియించె ఎనలేని ప్రేమ
వలచి వలపించే నినుపోలునేమో
చెలిమి లభియించె ఎనలేని ప్రేమ

సుమశరు కోపము హిమతరు తాపము
సుమశరు కోపము హిమతరు తాపము
ఎదిరించి ముదమార పోదాము
అదిగో..ఓ..మన ప్రేమ చెలువారు సీమ

చరణం::3

తొలకరి మెరుపుల అందాలు రోసి
తారల తళుకులతో పందాలు వేసి
తొలకరి మెరుపుల అందాలు రోసి
తారల తళుకులతో పందాలు వేసి
జిలిబిలి నెలవంకనుయ్యాల..చేసి
ఏలుదమిక మీద ఆకాశం
మన మేలుదమిక మీద ఆకాశం

ఇదియే..ఏ..మన ప్రేమ చెలువారు సీమ
పరమానంద భరితము కాంచుమా
ఇదియే..ఏ..మన ప్రేమ చెలువారు సీమ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

No comments: