Wednesday, November 13, 2013

జన్మదినోత్సవ శుభాభినందనలు శ్రీమతి P. సుశీల గారికి






















నేడు 77 వసంతాల గాయని శ్రీమతి P. సుశీల గారికి 
జన్మదినోత్సవ శుభాభినందనలు తెలియజేస్తోంది పాడుతా తీయగా చల్లగా..

ఫణి కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో ....

Phani Kumar Akkapeddi గారి మాటలలో .... 
ఆమె పాట వినని మనిషి ఉండడు.................

నేడు ప్రముఖ గాయకురాలు P.సుశీల (పులపాక సుశీల) గారి జన్మదినం. 50 సంవత్సరాల సినీ జీవితములో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలి, ఒరియా, సంస్కృత, తుళు, బడగ, సింహళ భాషలలో అనేక వేల గీతాలు పాడారు.

సుశీల 1935లో విజయనగరంలో సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి పి.ముకుందరావు ప్రముఖ క్రిమినల్ లాయరు. తల్లి శేషావతారం. 
స్కూల్లో చదివే రోజులలోనే అనేక సంగీత పోటిలలో పాల్గొన్నారు...స్కూల్ చదువులు పూర్తి కాగానే, విజయనగరం లోని మహారాజా సంగీత కళాశాల లో చేరారు...చాల పిన్న వయసులోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సంగీత డిప్లొమాలో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యారు..

1950లో సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ అనే సినిమాలో ఎదుకు అలత్తాయ్ అనే పాటతో తన కెరియర్ 1952 లో స్టార్ట్ చేసారు.....అదే సినిమా ను తెలుగులో కన్నతల్లి గా పునర్నిర్మించారు...దానిలో అదే పాటను ఘంటసాల గారితో పాడారు...

ఏ.వి.యం స్టూడియోస్ తో చాల రోజుల అనుబంధానికి అది నాంది....నెలసరి జీతానికి అనేక చిత్రాలకు ఏ.వి.యం స్టూడియోస్ తో పని చేసారు....

ఆ సరికే లీల, వసంత కుమారి, జిక్కి లు ప్రముఖ నేపధ్య గాయనిమణులు....తన సాధన, స్పష్టమైన ఉచ్చారణ, కమ్మని కోకిల కంఠం తో వీరిని మరిపించి, ప్రముఖ గాయని గా మారారు. 1955 లో విడుదల అయిన "మిస్సమ్మ" సుశీలమ్మ కెరియర్ ను తారాపధానికి తీసుకెళ్ళిడానికి చాలా తోడ్పడింది ....అక్కడినుంచి ఇక వెనుదిరగలేదు.....తెలుగులో ఘంటసాల గారితో, తమిళం లో టి.యం.సౌందర్య రాజన్ గారితో, కన్నడం లో "ప్రతివాద భయంకర" పి.బి.శ్రీనివాస్ గారితో ఆమె పాడిన యుగళ గీతాలు సంగీత ప్రపంచం లో ఒక నవశకానికి నాంది పలికాయి..1960 నుంచి సుశీలమ్మ హవా మొదలయింది...దాదాపుగా 25 వసంతాలు, అనగా 1985 వరకు ఆమె నెంబర్ వన్ ఫిమేల్ సింగర్........ఎన్నెన్నో అద్భుతమైన పాటలు, ఆణిముత్యాల ఆమె కెరియర్ లో ఉన్నాయి.....1985 నుంచి ఎంచుకున్న మంచి పాటలతో నే అనేక హిట్స్ ను అంది౦చారు....

2008 లో యం.ఎస్.విశ్వనాధన్, వైరముతు, జమునా రాణి, బాలసరస్వతి గార్లతో ఒక ట్రస్ట్ ను స్థాపించారు....ప్రతి సంవత్సరం టాలెంట్ ఉన్న గాయనీ గాయకులకు ఈ ట్రస్ట్ పురస్కారాలను అందిస్తుంది....ఆ సంస్థ ముఖ్య సూత్రాలు 

1) భారతీయ సంస్కృతి, సాంప్రదాయ, సాహిత్యాలను, జాతి ప్రయోజనాలకు అనుసంధానించడం
2) సెక్యులర్ సంస్థగా ధనాపేక్ష లేని non-commercial సంస్థగా పని చెయ్యడం 
3) సంగీత ప్రపంచానికి చెందిని వృద్ధ, పేద కళాకారులకు పెన్షన్స్ అందించడం, వైద్య సహాయం అందిచడం 
4) సంగీతము, కళలకు సంబంధించిన కళాశాలలను స్థాపించి వాటిని నడపడం 
5) ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ సంగీత కళాకారునికి పి.సుశీల అవార్డు ను ప్రదానం చెయ్యడం 
6) టాలెంట్ ఉన్న పేద సంగీత విద్యార్ధులకు వారి సంగీత సాధనకు కావలసిన ధన సహాయం, సంగీత పరికరాలను సమకూర్చటం
7) ప్రముఖ సంగీత కళాకారుల జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు భావి తరాల కోసం సేకరించి భద్రపరచడం 
సంగీత గ్రంధాలయం ని (పుస్తకాలు మరియి CDలు) ఏర్పాటు చేసి, దానిని నడపడం 

ఎన్నెన్నో అవార్డులు రివార్డులు...భారత జాతీయ పురస్కారాలలో ఉత్తమ గాయనిగా ఐదు సార్లు (1969 - ఉయిర్ మనిదన్, 1972 - సావలే సమాలి, 1978 - సిరిసిరి మువ్వ, 1983 -మేఘ సందేశం మరియు 1984- ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు),1969 లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం, 1971లో కేరళ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం,1975 లో మరల కేరళ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం ,1977 & 1978 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం ,1981 లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం ,1982,1984,1987,1989 లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం ,1989 లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం, 2001 రఘుపతి వెంకయ్య పురస్కారం, 2001 లో సుబ్బి రామిరెడ్డి గారి ద్వారా దశాబ్దపు ఉత్తమ గాయని పురస్కారం, 2005 లో స్వరాలయ ఏసుదాస్ పురస్కారం, 2006 లో ఫిలిం ఫేర్ వారి జీవన సాఫల్య పురస్కారం, 2008 జనవరి 25 న ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం ఇలా ఎన్నో ఎన్నెన్నో పురస్కారాలు ఈ గాన కోకిలను వరించాయి..
Rvss Srinivas

No comments: