Monday, November 18, 2013

దేవకన్య--1968


సంగీతం::T.V. రాజు 
రచన::వీటూరి సుందర రామమూర్తి  
గానం::ఘంటసాల 
శ్రీ ఛాయ చిత్ర వారి
దర్శకత్వం::K.హేమాంబరధరరావు
తారాగణం::కాంతారావు, కాంచన, రాజనాల, నాగయ్య,మిక్కిలినేని, రమాప్రభ

పల్లవి::

ఈశా గిరీశా మహేశా
జయ కామేశ కైలాస వాసా
ఈశా గిరీశా మహేశా
జయ కామేశ కైలాస వాసా
ఈశా గిరీశా మహేశా

చరణం::1

గంగా తరంగాల కలుషాలు మాపె
కాశీ పురాధీశ విశ్వేశ్వరా
కాశీ పురాధీశ విశ్వేశ్వరా

మోక్షద్వారము ద్రాక్షారామము
భవ భయ దూర భీమేశ్వరా
భవ భయ దూర భీమేశ్వరా

భక్తవశంకర భ్రమరాంభికా వర
శ్రీకర శ్రీశైల మల్లీశ్వరా
శ్రీకర శ్రీశైల మల్లీశ్వరా

వాయులింగా స్మరదర్ప భంగా
ధవళాంగ శ్రీకాళహస్తీశ్వరా
ధవళాంగ శ్రీకాళహస్తీశ్వరా

కాంచీపురీవర ఏకాంబరేశ్వర
కామేశ్వరీ వామభాగేశ్వరా

శ్రీ సుందరేశా మీనాక్షీ మనోజా
నమో చిదంబర నటరాజా
నమో చిదంబర నటరాజా

తరుణేందు శేఖర అరుణాచలేశ్వరా
తరుణేందు శేఖర అరుణాచలేశ్వరా

సాకార ఓంకార అమరేశ్వరా
శ్రితజన మందార కేదారేశ్వర

రామప్రతిష్టిత సైకత లింగా 
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.
రామప్రతిష్టిత సైకత లింగా

రమ్య శుభాంగా రామలింగా
రమ్య శుభాంగా రామలింగా
శ్రీరామ లింగా రామలింగా
శ్రీరామ లింగా రామలింగా
శ్రీరామ లింగా రామలింగా

No comments: