Sunday, October 03, 2010

భార్యాబిడ్డలు--1972


























సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::ఘంటసాల,L.R.ఈశ్వరీ

పల్లవి::

ఆ ఆహా..ఆహ్హ ఆహ్హ..ఆ ఓ ఓఓఓఓ 
ఆ ఆహా..ఆహ్హ ఆహ్హ..ఆ ఓ ఓఓఓఓ 

ఆకులు పోకలు ఇవ్వద్దు..నోరు ఎర్రగ చేయద్దు
ఆకులు పోకలు ఇవ్వద్దు..నా నోరు ఎర్రగ చేయద్దు
ఆశలు నాలో రేపద్దు..నా వయసుకు అల్లరి నేర్పద్దు..పాపా..పాపా

ఆకులు పోకలు ఇవ్వద్దు..నోరు ఎర్రగ చేయద్దు
ఆకులు పోకలు ఇవ్వద్దు..నా నోరు ఎర్రగ చేయద్దు
ఆశలు నాలో రేపద్దు..నా వయసుకు అల్లరి నేర్పద్దు..మావా..మావా

పా..పా...మావా...
అ ఆహా..ఓ..హో..అ ఆ హా ఓ..హో

చరణం::1

ఊరుకొన్న నన్ను నువ్వే ఊరించావు
నే నోపలేనంతగా ఉడికించావు

ఊరుకొన్న నన్ను నువ్వే ఊరించావు
నే నోపలేనంతగా ఉడికించావు

ఊరించానా..నిన్నుడికించానా
ఊరించానా..నిన్నుడికించానా
ఉత్తొత్తి నిందలేస్తే ఒప్పుకోనూ.. 
నాకుడుకెక్కిందంటే నేనూరుకోనూ..పాపా..పాపా..

ఆకులు పోకలు ఇవ్వద్దు..నా నోరు ఎర్రగ చేయద్దు
ఆశలు నాలో రేపద్దు..నా వయసుకు అల్లరి నేర్పద్దు..పాపా..పాపా..

మావా..ఆ ఆ ఆ..పాపా..

చరణం::2

ఎర్రని పెదవిని పంట నొక్కకు
నన్ను వెర్రివాణ్ణి చేసి నీ వెంట తిప్పకు

ఎర్రని పెదవిని పంట నొక్కకు
నన్ను వెర్రివాణ్ణి చేసి నీ వెంట తిప్పకు

పంట నొక్కానా..నే వెంట తిప్పానా..
పంట నొక్కానా..నే వెంట తిప్పానా..
గజ్జల గుర్రమంటి కన్నె పిల్లకు
కళ్ళతోటి కళ్ళమేసి కదం తొక్కకూ..మావా..మావా..

ఆకులు పోకలు ఇవ్వద్దు..నా నోరు ఎర్రగ చేయద్దు
ఆశలు నాలో రేపద్దు..నా వయసుకు అల్లరి నేర్పద్దు..మావా..మావా..

పాపా..ఆ ఆ ఆ..మావా..

అ ఆహా..ఓ..హో..అ ఆ హా ఓ..హో

చరణం::3

ముద్దు ముద్దుగా నన్ను చూసుకున్నావు
వద్దు వద్దన్న నిన్ను నేనొదిలి పెట్టను

ముద్దు ముద్దుగా నన్ను చూసుకున్నావు
వద్దు వద్దన్న నిన్ను నేనొదిలి పెట్టను

వద్దన్నానా..ననొదలమన్నానా..
పొద్దంతా నీతోటే గడచిపోతది..
నీ ముద్దు మొగంతోనె నాకు పొద్దు పొడిచేది..పాపా..పాపా

ఆకులు పోకలు ఇవ్వద్దు..నా నోరు ఎర్రగ చేయద్దు
ఆశలు నాలో రేపద్దు..నా వయసుకు అల్లరి నేర్పద్దు..మావా..పాపా..

మావా..ఆ ఆ ఆ..పాపా..హేయ్....య్య....

No comments: