Tuesday, October 19, 2010

అమాయకురాలు--1971

సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు, P.సుశీల
తారాగణం::అక్కినేని,శారద,కాంచన,నాగభూషణం,గుమ్మడి,చంద్రమోహన్,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,చలం,అల్లురామలింగయ్య.

పల్లవి::

చిన్నారి పైడి బొమ్మ..కన్నీరు ఎందుకమ్మా
నీ తల్లి బాధ మరిచి..నిదురించవే..ఏ..నిదురించవే
చిన్నారి పైడి బొమ్మ..కన్నీరు ఎందుకమ్మా
నీ తల్లి బాధ మరిచి..నిదురించవే

చరణం::1

ఏ పాపమెరుగని నీవు..నా పాపవైనావమ్మా
ఏ పాపమెరుగని నీవు..నా పాపవైనావమ్మా
రేపటి నీ బ్రతుకును తలచి..రేయి పగలు వగచేనమ్మా
చిన్నారి పైడి బొమ్మ..కన్నీరు ఎందుకమ్మా

చరణం::2

జాలి లేని శిలకే నేను..తాళి లేని సతినైనాను
జాలి లేని శిలకే నేను..తాళి లేని సతినైనాను
దిక్కు లేని తల్లిని చూచి..వెక్కి వెక్కి ఏడుస్తావా
వెక్కి వెక్కి ఏడుస్తావా..

చరణం::3

చల్లని నీ నవ్వుల కోసం..చావలేక జీవించేను
చల్లని నీ నవ్వుల కోసం..చావలేక జీవించేను
నీవు కరిగి నీరవుతుంటే..నేను చూడలేనే తల్లి

చిన్నారి పైడి బొమ్మ..కన్నీరు ఎందుకమ్మా
నీ తల్లి బాధ మరిచి..నిదురించవే..ఏ..నిదురించవే

Amayakuralu--1971
Music::Saluri Rajeswara Rao
Lyricis::C.Narayana Reddy
Singer's::S.P.Balu,P.Suseela 

:::::

chinnari paidi bomma..kanneeru yendukamma
ne talli badha marichi..nidurinchave..E..nidurinchave
chinnari paidi bomma..kanneeru yendukamma
ne talli badha marichi..nidurinchave

:::::1

ye papamerugani neevu..na papavainaavammaa
ye papamerugani neevu..na papavainaavammaa
repati ne bratukunu talachi..reyi pagalu vagachenammaa
chinnari paidi bomma..kanneeru yendukamma

:::::2

jaali leni shilake nenu..taali leni satinainaanu
jaali leni shilake nenu..taali leni satinainaanu
dikku leni tallini chuchi..vekki vekki yedustaavaa
vekki vekki yedustaavaa..

:::::3

challani ne navvula kosam..chavaleka jeevinchenu
challani ne navvula kosam..chavaleka jeevinchenu
neevu karigi neeravutunte..nenu chudalene talli

chinnari paidi bomma..kanneeru yendukamma
ne talli badha marichi..nidurinchave..E..nidurinchave

No comments: