Friday, September 27, 2013

సంసారం ఒక చదరంగం--1987

సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::P.సుశీల 

తారాగణం::శరత్ బాబు,సుహాసిని,షావుకారు జానకి,

గొల్లపూడి మారుతీ రావు,అన్నపూర్ణ,రాజేంద్ర ప్రసాద్,అరుణ.

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
జానకి రాముల కల్యాణానికి..జగమే ఊయలలూగెనులే

జానకి రాముల కల్యాణానికి..జగమే ఊయలలూగెనులే
సీతాదేవి కులుకులనే..సీతాకోక చిలుకలతో
జానకి రాముల కల్యాణానికి..జగమే ఊయలలూగెనులే

చరణం::1

కన్ను కన్ను కలవగనే..ప్రణయం రాగం తీసెనులే
పాదం పాదం కలపగనే..హృదయం తాళం వేసెనులే

ఒకటే మాట..ఒకటే బాణం..ఒక పత్ని..శ్రీరామ వ్రతం
నాలో..ఓ..నీలో..ఓ..రాగం తీసి..వలపే పలకే త్యాగయ కీర్తనలెన్నో

జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే
సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో
జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే

చరణం::2

జానకి మేను తాకగనే..జళ్ళున వీణలు పొంగినవి
జాణకు పూతలు పూయగనే..జావళి అందెలు మ్రోగినవి

ప్రేమే సత్యం ప్రేమే నిత్యం..ప్రేమే లేదా మయ్యమతం
నాలో..ఓ..నీలో..ఓ..నాత్యాలాడి లయలే చిలికే రమదాసు కృతులెన్నో

జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే
సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో
జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే

No comments: