Saturday, September 21, 2013

దేవుడు చేసిన మనుషులు--1973::వలజి::రాగం



















సంగీతం::రమేష్ నాయుడు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల

తారాగణం::నందమూరి తారక రామారావు,కృష్ణ,
S.V. రంగారావు,జయలలిత,విజయనిర్మల,
జగ్గయ్య,కాంతారావు,కాంచన,శారద

వలజి::రాగం
{కళావతి--హిందుస్తాని}

పల్లవి::

మరల రేపల్లె వాడలో..మురళి మోగే 
మోడు వారిన హృదయాలు పూయసాగే 

విన్నారా..ఆ ఆ..విన్నారా 
అలనాటి వేణుగానం..మోగింది మరలా
అలనాటి వేణుగానం..మోగింది మరలా
చెలరేగే మురళీ సుధలు..తలపించును కృష్ణుని కథలు 
విన్నారా..ఆ..

చరణం::1

పుట్టింది ఎంతో గొప్ప వంశం..పెరిగింది ఏదో మరో లోకం 
పుట్టింది ఎంతో గొప్ప వంశం..పెరిగింది ఏదో మరో లోకం 
అడుగడుగున గండాలైనా..ఎదురీది బతికాడు 
చిలిపి చిలిపి దొంగతనాలు..చిననాడే మరిగాడు

దొంగైనా..ఆ..దొర అయినా..ఆ..మనసే హరించేనులే 
విన్నారా..ఆ.. 
అలనాటి వేణుగానం మోగింది మరలా
అలనాటి వేణుగానం మోగింది మరలా

చరణం::2

ద్వేషించే కూటమిలోనా నిలచీ
ప్రేమించే మనిషే కదా మనిషి 
ద్వేషించే కూటమిలోనా నిలచీ
ప్రేమించే మనిషే కదా మనిషి 

ఆడేది నాటకమైనా..పరుల మేలు తలచాడు 
ఆడేది నాటకమైనా..పరుల మేలు తలచాడు 
అందరికీ ఆనందాల..బృందావని నిలిచాడు 

ఆనాడూ ఈనాడూ మమతే తరించేనులే 
విన్నారా..ఆ.. 
అలనాటి వేణుగానం మోగింది మరలా
చెలరేగే మురళీ సుధలు తలపించును కృష్ణుని కథలు 
విన్నారా..ఆ..

No comments: