రచన::కొసరాజు
సంగీతం::మాస్టర్ వేణు
గానం::ఘంటసాల,P. సుశీల
మాడ్::రాగం
పల్లవి::
ముద్దబంతి పూలు బెట్టి మొగిలి రేకులు
జడను చుట్టి జడను చుట్టి
హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా..చిట్టెమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
ముద్దబంతి పూలు బెట్టి మొగిలి రేకులు జడను చుట్టి
హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
అద్దమంటి మనసు ఉంది
అందమైన వయసు ఉంది..వయసు ఉంది
ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా..కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా..చెప్పయ్యా
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది
ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
తందానె తానెననే తందానె తానెననే
తనెననేనానే తానేనా హోయ్
చరణం::1
పుట్టింటి అరణాలూ..ఘనమైన కట్నాలూ
పుట్టింటి అరణాలూ..ఘనమైన కట్నాలూ
అత్తవారింట నిండా వేసినా
అవి అభిమానమంత విలువజేసునా
అభిమానమంత విలువజేసునా
హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
చరణం::2
అభిమానమాభరణం మరియాదె భూషణం
అభిమానమాభరణం మరియాదె భూషణం
గుణము మంచిదైతే చాలయా
మన గొప్పతనము చెప్పుకోను వీలయా
మన గొప్పతనము చెప్పుకోను వీలయా
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది
ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
చరణం::2
కాలు చెయ్ లోపమనీ..కొక్కెరాయి రూపమనీ
కాలు చెయ్ లోపమనీ..కొక్కెరాయి రూపమనీ
ఒదినలు నన్ను గేలి చేతురా
పిల్లను దెచ్చి పెళ్ళి చేతురా..పిల్లను దెచ్చి పెళ్ళి చేతురా
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి
నవ్విన నాప చేనె పండదా
నలుగురు మెచ్చురోజు ఉండదా
నలుగురు మెచ్చురోజు ఉండదా
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది
ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
ముద్దబంతి పూలు బెట్టి మొగిలి రేకులు జడను చుట్టి
హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
No comments:
Post a Comment