సంగీతం::సత్యం
రచన::సాహితి
గానం::G.ఆనంద్ , P.సుశీల
ప్రేమ బృందావనం ..
పలికేనే స్వాగతం
ఆ రాముడు నా వరునిగా... చేరగా..
ప్రేమ బృందావనం
ప్రేమ బృందావనం..
పలికేనే స్వాగతం
ఆ సీతే ..నా వధువుగా చేరగా.. ప్రేమ బృందావనం
పెళ్లికే కాలమనే పందిరే వేసేనయ్య
పచ్చని తీగలనే తోరణం చేసేనయ్యా.
తారలే తలంబ్రాలై కురిసేనయ్యా..
నా... కన్నుల ... కళ్యాణ జ్యోతుల కాంతులు మెరిసే..
ప్రేమ బృందావనం
గాలికే నీ అందం కవితలే నేర్పెనమ్మా
వీణకే నీ గానం స్వరములే తెలిపెనమ్మ
చందమామ నీ ముందు ఎందుకే బొమ్మ
ఆ.. ..అమ్మమ్మ ..అపురూప సుందర అప్సర నువ్వు
ప్రేమ బృందావనం
పాలలో తేనెవలె
మనసులే కలిసేనయ్య
కలసిన కొంగులు రెండు విడిపోవమ్మ
మా.. జంటనే దీవించగా గుడి గంటలు మ్రోగే
ప్రేమ బృందావనం
No comments:
Post a Comment