సంగీతం::పెండ్యల
రచన::మల్లాది
గానం::ఘంటసాల
అభేరి ::: రాగం
పల్లవి::
రాగమయి రావే అనురాగమయి రావే
రాగమయి రావే అనురాగమయి రావే
రాగమయి రావే అనురాగమయి రావే
అనుపల్లవి::
నీలాల గగనాన నిండిన వెన్నెల ఆ
నీలాల గగనాన నిండిన వెన్నెల ఆ
నీ చిరునవ్వుల కలకల లాడగా
రాగమయి రావే అనురాగమయి రావే
రాగమయి రావే
చరణం::1
చిగురులు మేసిన చిన్నరి కోయిల మరి మరి మురిసే మాధురి నీవే
చిగురులు మేసిన చిన్నరి కోయిల మరి మరి మురిసే మాధురి నీవే
తనువై మనసై నెలరాయనితో కలువలు కులికే సరసాలు నీవే సరసాలు నీవే సరాగాలు నీవే
రాగమయి రావే అనురాగమయి రావే
రాగమయి రావే
చరణం::2
సంధ్యలలో సంధ్యలలో హాయిగా సాగే చల్లని గాలిలో
మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
జిలుగే సింగారమైన చుక్కకన్నెలు అంబరాన
జిలుగే సింగారమైన చుక్కకన్నెలు అంబరాన
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను నవ పరిమళమే నీవు
రాగమయి రావే అనురాగమయి రావే
రాగమయి రావే
చరణం::3
నీడచూసి నీవనుకొని పులకరింతునే అలవికాని మమతలతో కలువరింతునే
నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలపన
కన్నెలందరు కలలుకనే అందాలన్ని నీవే
నిన్నందుకొనే మైమరిచే ఆనందమంతా నేనే
రావే రాగమయి నా అనురాగమయి రావే
రాగమయి నా అనురాగమయి రావే
2 comments:
penDyaalavaari svarakalpanaloe ,ghantasaalavaari madhurageetam.
పెండ్యాలవారి స్వరకల్పనలో ఘంటసాలవారి మధుర గీతం.కాని ఒక సవరణ.'' చిలుగే సింగారమైన చుక్కకన్నెలు అమరాన ''కాదు. ''జిలుగే సింగారమైన చుక్కకన్నెలు అంబరాన '' అని సవరించుకొండి.
Namaste ___/\___ kamaneeyam garu
chaalaa thanks andii...meeru naa blog ku raavadame...santosham andulo paatalu savarinchadam maro aanandam tappaka ii tappunu diddutaanandi...krutajnalato..
premato..
Shakthi
Post a Comment