Thursday, August 23, 2012

చక్రధారి--1977





సంగీతం::G.K.వెంకటేష్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఆనంద్,S.P.బాలు

పల్లవి::

విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥
సర్వం మరచీ నీ స్మరణము సేయ
స్వర్లోక ఆనందమే॥
విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥

చరణం::1

అంబుజనాభా నమ్మిన వారికి
అంబుజనాభా నమ్మిన వారికి
అభయమునొసగీ ఆర్తిని బాపీ
ఉభయ తారకా పథమును చూపీ
ఉభయ తారకా పథమును చూపీ
ఉద్ధరించు కరుణా సింధో
విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥

చరణం::2

నిన్నెరిగించే జ్ఞానమే జ్ఞానము
నిన్నెరిగించే జ్ఞానమే జ్ఞానము
నిను స్మరియించే ధ్యానమే ధ్యానము
నిను కీర్తించే గానమే గానము
నిను కీర్తించే గానమే గానము
నీకర్పించే జన్మమే జన్మము

విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥
సర్వం మరచీ నీ స్మరణము సేయ
స్వర్లోక ఆనందమే॥
విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥

No comments: