Sunday, December 18, 2011

మంచిమనసులు--1962




సంగీతం::K.V.మహాదేవన్ 
రచన:కోసరాజు  
గానం::జమునారాణి
తారాగణం::అక్కినేని,సావిత్రి,జానకి,నాగభూషణం,S.V.రంగారావు,వాసంతి

పల్లవి::

అహా..అహా..అహ..ఆఆ
ఎంతా టక్కరివాడు నా రాజు
ఏ మూలనో నక్కినాడు
ఎంతా టక్కరివాడు నా రాజు
ఏ మూలనో నక్కినాడు
పంటచేను గట్టుమీద
ఒంటిగ నే పోతుంటే
వెంట వచ్చినట్టులున్నది
ఎవరో వెనక నిలిచినట్టులున్నది
వెంట వచ్చినట్టులున్నది
ఎవరో వెనక నిలిచినట్టులున్నది 
గుబులు గుబులుగా..గుండె ఝల్లుమని 
గుబులు గుబులుగా..గుండె ఝల్లుమని
బిక్కు బిక్కుమని..చూశాను
ఫక్కున పక్కనే..నవ్వేను
ఎవరూ..నా నీడ 

ఎంతా టక్కరివాడు నా రాజు
ఏ మూలనో నక్కినాడు

చరణం::1

పొర్లిపారు ఏటిలోన
బుటుకు బుటుకు మునుగుతుంటే
బుగ్గ తాకినట్టులున్నది
ఎవరో పైట లాగినట్టులున్నది
గిలిగింతలు పెట్టినట్లు
ఒడలంతా పులకరించే
నీళ్లంతా వెదికినాను
తుళ్లి తుళ్లి పారిపోయేనూ 
ఎవరూ చేప..

ఎంతా టక్కరివాడు నా రాజు
ఏ మూలనో నక్కినాడు

చరణం::2

అర్ధరాత్రి వేళ నేను..
ఆదమరచి నిదురపోతే..
వద్ద చేరినట్టులున్నది
ఎవరో ముద్దులాడినట్టులున్నది
వద్ద చేరినట్టులున్నది
ఎవరో ముద్దులాడినట్టులున్నది
చిక్కినాడూ దొంగయనుకొని
చేయి చాచి పట్టబోతే..మ్మ్.. 
కంటికేమి కానరాక
కరిగి కరిగి పోయెను
ఎవరూ..కల..

ఎంతా టక్కరివాడు నా రాజు
ఏ మూలనో నక్కినాడు
ఎంతా టక్కరివాడు నా రాజు
ఏ మూలనో నక్కినాడు 

No comments: