Wednesday, September 05, 2012
తూర్పు వెళ్ళే రైలు--1979
సంగీతం::S.P.బాలసుబ్రహ్మణ్యం
రచన::ఆరుద్ర
గానం::S.P. బాలసుబ్రహ్మణ్యం
పల్లవి::
వేగుచుక్క పొడిచింది వేకువ కాబోతుంది
వేగుచుక్క పొడిచింది వేకువ కాబోతుంది
గాలిలోన తేలే నాదం మేలుకొలుపు పాడింది
మేలుకొలుపు పాడింది
వేగుచుక్క పొడిచింది..........
చరణం::1
కట్టుకున్న మంచు చీర కరిగి జారిపోతుంది
ముసురుకున్న చీకటిలో వెలుగు దూసుకొస్తుంది
కట్టుకున్న మంచు చీర కరిగి జారిపోతుంది
ముసురుకున్న చీకటిలో వెలుగు దూసుకొస్తుంది
దూరంగా నా నేస్తం తూరుపు బండి కూసింది
ఊరంతా మొద్దునిద్రలో ముసుగుతన్ని పడుకుంది
వేగుచుక్క పొడిచింది వేకువ కాబోతుంది
చరణం::2
ఆశల వెలుగుల తూరుపుబండి దూసుకుపోవాలి
నన్ను తీసుకుపోవాలి
లోకంలోని వెలుగు నీడ లోతులు చెప్పాలీ
రేపటి రూపును లోపలి కళ్ళకు నేడే చూపాలి
రాసిన పాటకు ప్రాణం పోసి
పేరును తేవాలి మంచి పేరును తేవాలి
Labels:
తూర్పు వెళ్ళె రైలు--1979
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment