Tuesday, July 17, 2012

మహామంత్రి తిమ్మరుసు--1962::సురటి::రాగం

సంగీతం::పెండ్యాల
రచన::పింగళి
గానం::S.వరలక్ష్మి

సురటి::రాగం
(సురఠ్::హిందుస్తాని) 

పల్లవి::

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా...
తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..ఆ..ఆ

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా

చరణం::1

వేణు గానమున తేరగ పిలిచి..మౌనము పూనగ ఏలనో
వేణు గానమున తేరగ పిలిచి..మౌనము పూనగ ఏలనో

అలకయేమో యని దరి రాకుండిన జాలిగ చూచే వేలనో
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా

చరణం::2

నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో
నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో

మైమరచిన చెలి మాటే లేదని.......
ఆ..ఆ..ఆ ..ఆ ..ఆ..ఆ..ఆ
మైమరచిన చెలి మాటే లేదని..ఓరగ చూచే వేలనో

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా
తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియను గా...

3 comments:

mani hyderabad said...

amulyamina,madhuramina sangeeta sahitya rasagulikalanu andhinchina meeku dhanyavadalu. chala santhoshamga unnadi ee pata chusinanduku oka sari adrusyam gurthuku vachindi. manchi pata andinchinanduku abhinandanalu.

srinath kanna said...

Thank you Mani garu

meeku nachina patalu evaina unte cheppandi avikuda post chestanu...
naa blog ku vachina meeku dhanyavadaalu :)