Tuesday, May 29, 2012

పండంటి సంసారం--1975




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::భానుమతి

సాకీ::
చావే ఎరుగని ఇంటినుంచి ఆవాలు తెమ్మన్నాడుట బుద్ధుడు
అలాగే మచ్చుకు ఏ పిచ్చిలేని ఒక మనిషిని చూపండి ఈనాడు


పల్లవి::

పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి
పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి

చరణం::1

మనసుంటేనే పిచ్చి...మతి ఉంటేనే పిచ్చి
మనసుంటేనే పిచ్చి...మతి ఉంటేనే పిచ్చి
మంచితనం అన్నింటిని మించిన పిచ్చి....

పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి
పిచ్చి పిచ్చి పిచ్చి.....

చరణం::2

వెర్రిమొర్రిగా ప్రేమించడమూ కుర్రవాళ్ల పిచ్చి
కస్సుబుస్సుమని ఖండించటమూ కన్నవాళ్ళ పిచ్చి
భక్తి పిచ్చి..ముక్తి పిచ్చి...విరక్తి పిచ్చి....
పదవుల పిచ్చి..పెదవుల పిచ్చి....మధువుల పిచ్చి...

పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి

చరణం::3

చీకటివెలుగులు కష్టసుఖాలు సృష్టించటమే దేవుడి పిచ్చి
చీకటివెలుగులు కష్టసుఖాలు సృష్టించటమే దేవుడి పిచ్చి
ఆ దేవుడి కోసం దేవులాడటం మనుషుల పిచ్చి

పిచ్చి పిచ్చి పిచ్చి

చరణం::4

ఉన్నవాడికి ఇంకా ఇంకా కావాలని పిచ్చి
వాడ్ని లేనివాడిగా చేయాలని లేనివాడికి పిచ్చి
ఉన్నది లేదు లేనిది ఉంది అన్నది పిచ్చి
నేనన్నది పిచ్చని అన్నవారికే ఉన్నది పిచ్చి

పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి
పిచ్చి పిచ్చి పిచ్చి.....

No comments: