Saturday, November 19, 2011

అందాల రాముడు--1973
















చిమ్మట ఖజానాలోని మరో ముత్యం వినండి
సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల


మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
మము బ్రోవమని చెప్పవే

మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
మము బ్రోవమని చెప్పవే

ఏకాంత రామయ్యా నీ చెంత దాచిరి
చల్లంగ నీ ముద్దు చెల్లించు వేళా

మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
మము బ్రోవమని చెప్పవే

చరణం::1

నీరూ ఈ గోదారి తీరాన నడిచారు
చన్నీళ్ళు కన్నీళ్ళు కలబోసుకొన్నారు
ఆ కథను కాస్తా గురుతు చేసుకొమ్మనీ
మా కష్తము కాస్త చూసి పొమ్మనీ
నీవైన చెప్పవమ్మ రామయ్యకూ..మా అయ్యకూ..

మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
మము బ్రోవమని చెప్పవే

చరణం::2

మారాజులు మంత్రులు మిమ్మడగ వచేవారమే
మా బోటి ధీనులు..మీ కడకు వచ్చేవారలే
ఇంతో అంతో ముడుపు కట్టి అంతటయ్యను మాయజేసి
లక్షలు మోక్షమ్ముకోరే..గడుసు బిక్షగాళ్ళము
ఒట్టి పిచ్చివాళ్ళము..
ఆదుకొమ్మనీ పైకి చేరుకొమ్మని చెప్పవమ్మ
రామయ్యకూ..మా అయ్యకూ

మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
మము బ్రోవమని చెప్పవే

చరణం::3

పులిని చూస్తే పులి ఎన్నడు బెదరదూ..
మేక వస్తే మేక..ఎన్నడు అదరదూ
మాయ రోగమదేమో కాని..మనిషి మనిషికి కుదరదూ
ఎందుకో తెలుసా తల్లీ
ఉన్నది పోతుందన్న బెదురుతో..
అనుకొన్నది రాదేమోనన్న అదురుతో
కొట్టు కొంటూ తిట్టుకోంటూ కొండ కెక్కే వాళ్ళము
నీ అండ కోరే వాళ్ళము

కరుణించమని చెప్పవే మా కన్న తల్లి
కరుణించమని చెప్పవే..

మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
మము బ్రోవమని చెప్పవే

No comments: