సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు , P.సుశీల
పల్లవి::
అందం శరణం గచ్చామి
అధరం శరణం గచ్చామి
ఈ సాయంత్ర వేళ నీ ఏకాంతసేవ
అతి మధురం అనురాగం
ఒదిగే వయ్యారం
ప్రణయం శరణం గచ్చామి
హృదయం శరణం గచ్చామి
ఈ సింధూర వేళ నీ శృంగార లీల
సుఖ శిఖరం శుభయోగం
అది నా సంగీతం
చరణం::1
ఇంతకు తీరని ఎదలో ఆశలేమో
అడగరానిదై చెప్పరానిదై
పెదవుల అంటింతనై
మాటతో తీరని మదిలో దాహమే
చిలిపి ముద్దుకై చినుకు తేనెకై
కసికసి కవ్వింతలై
నీ నవ్వు నాలో నాట్యాలు చేసే
కౌగిట్లో సోకమ్మ వాకిట్లో
తెరిచే గుప్పిళ్ళలోన
ప్రణయం శరణం గచ్చామి
హృదయం శరణం గచ్చామి
చరణం::2
చూపుతో గిచ్చక వయసే లేతదమ్మా
వలపు గాలికే వాడుతున్నది
విసరకు పూబాణమే
చేసుకో మచ్చిక వరసే కొత్తదమ్మా
చలికి రేగిన ఒడికి చేరిన
చెరి సగమీ ప్రాణమే
నీ ఊపిరే నాలో పూలారబోసి
అందాలో నా ప్రేమ గంధాలో
ముసిరే ముంగిళ్ళలోన
అందం శరణం గచ్చామి
హృదయం శరణం గచ్చామి
ఈ సాయంత్ర వేళ నీ ఏకాంతసేవ
సుఖ శిఖరం శుభయోగం
అది నా సంగీతం
No comments:
Post a Comment