సంగీతం::Sరాజేశ్వరరావు
గాత్రం:ఘంటసాల
రచన::శ్రీ శ్రీ
డైరెక్టర్::ఆదుర్తి సుబ్బారావు
ప్రొడ్యుసర్::D.మధుసూధనరావు
సంస్థ:అన్నపూర్ణా పిక్చర్స్
విడుదల::1964
నటీనటులు::నాగేశ్వరరావు,జగ్గయ్య,సావిత్రి,షావుకారు జానకి,కృష్ణకుమారి
రాగం:::జయ్‌జయ్‌వంతి
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన్న అదే బాగ్యము అదే స్వర్గము
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన్న అదే బాగ్యము అదే స్వర్గము
ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన్న అదే బాగ్యము అదే స్వర్గము
నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన్న అదే బాగ్యము అదే స్వర్గము
చెలిమియే కరువై వలపే అరుదై
చెదరిన హృదయమే శిలయైపోగా
నీ వ్యధ తెలిసి నీడగ నిలిచే
తోడొకరుండిన్న అదే బాగ్యము అదే స్వర్గము
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన్న అదే బాగ్యము అదే స్వర్గము
No comments:
Post a Comment