Sunday, November 27, 2011

భార్యాభర్తలు--1961



ఈ పాట ఇక్కడ వినండి


సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

ఆమె::మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం

అతడు::చల్లని పున్నమి వెన్నెలలో..ఓ..ఓ..ఓ
ఎన్నడు వీడని కౌగిలిలో..ఆ..ఆ..ఆ
చల్లని పున్నమి వెన్నెలలో
ఎన్నడు వీడని కౌగిలిలో

ఆమె::కన్నుల వలపు కాంతుల మెరయగ
మధురం మధురం ఈ సమయం

అతడు::ఇక జీవితమే ఆనందమయం

ఇద్దరు::మధురం మధురం ఈ సమయం

చరణం::1

అతడు::కరగిపోయె పెను చీకటి పొరలూ
కరగిపోయె పెను చీకటి పొరలూ

ఆమె::తొలగిపోయె అనుమానపు తెరలు
తొలగిపోయె అనుమానపు తెరలు

అతడు::పరిమళించె అనురాగపు విరులు
పరిమళించె అనురాగపు విరులు

ఆమె::అలరెనె మనసు నందనవనముగ

ఇద్దరు::మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం

చరణం::2

అతడు::సఫలమాయె మన తీయని కలలూ
సఫలమాయె మన తీయని కలలూ

ఆమె::జగము నిండె నవజీవన కళలు
జగము నిండె నవజీవన కళలు

అతడు::పొంగిపొరలే మన కోర్కెల అలలు
పొంగిపొరలే మన కోర్కెల అలలు

ఆమె::భావియే వెలిగె పూవుల బాటగా

ఇద్దరు::మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

No comments: