సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::S.P.బాలు
Directed by :సింగీతం శ్రీనివాసరావు
తారాగణం::జయప్రద,రంగనాద్,కాంతారావు,దీప,రాజశ్రీ,రమాప్రభ,సాక్షి రంగారావు
రాగం:::ఖమాస్
మధు మాస వేళలో మరుమల్లె తోటలో
మధు మాస వేళలో మరుమల్లె తోటలో
మనసైన చిన్నది లేదేలనో
మధు మాస వేళలో మరుమల్లె తోటలో
ఆడింది పూల కొమ్మ పాడింది కోయిలమ్మ
అనురాగ మందిరంలో కనరాదు పైడిబొమ్మ
ప్రణయాలు పొంగే వేళ ప్రణయాలు పొంగే వేళ
నాలో రగిలే ఎదో జ్వాల
మధు మాస వేళలో మరుమల్లె తోటలో
ఉదయించె భానుబింబం వికసించలేదు కమలం
నెల రాజు రాక కోసం వేచింది కన్నెకుమురం
వలచింది వేదనకేనా వలచింది వేదనకేనా
జీవితమంత దూరాలేన
మధు మాస వేళలో మరుమల్లె తోటలో
మనసైన చిన్నది లేదేలనో
మధు మాస వేళలో మరుమల్లె తోటలో
4 comments:
శ్రీకాంత్ గారు, మంచి పాట వ్రాసారు. అయితే ఇందులో కొన్ని తప్పులు దొర్లాయి. మొదటి చరణంలో "నాలోన రగిలే" కాదు. "నాలో రగిలే" సరియైనది. అలాగే రెండవ చరణం తీసుకుంటే క్రింది సవరణ చూడగలరు.
ఉదయించె భాను బింబం వికసించ లేదు కమలం
నెలరాజు రాక కోసం వేచింది కన్నె కుమురం
రాగం ఖమాస్ అవునో కాదో తెలియదు నాకు. నిర్ధారణ చేసుకుని వ్రాయగలరు. అలాగే పాటను పోస్టు చేసే ముందు శ్రద్ధగా వినండి. మంచి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక అభినందనలు.
నమస్తే సూర్యనారాయణగారు __/\__
నాపేరు శక్తి :)
మా Blog ను సందర్శించినందుకు
చాలా చాలా కృతగ్నతలు.
తప్పుల సవరణకు మరో థాంక్స్
ఇకపోతే నే చేసిన పొరపాటు
పాట సరిగా వినకపోవటమే :(
ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండగచూసుకోంటాను.
మా Blog కు మళ్ళి మళ్ళి రావాలని కోరుకొంటున్నాను
మీ రాకవల్లేకదా మా తప్పులు తెలిసాయి
మరోమారు కృతగ్నతలు తెలుపుతు సెలవు
ప్రేమతో
శక్తి
శక్తి గారికి, సూచనలను సహృదయంతో స్వీకరించినందుకు కృతజ్ఞతలు. రెండవ చరణంలో "కుముదం" అంటే తెల్ల కలువ అని అర్ధం. అది సరిపోయింది గాని, వేటూరి గారు "కుమురం" అని వ్రాసారు. అలాగే వినిపిస్తుంది. కాలేజి రోజులనుండి ఈ పాట చిరపరిచితం నాకు. ఇంకొక బ్లాగులో కూడ చూసి "కుమురం" అని నిర్ధారించుకున్నాను. ఈ మార్పు చేయగలరు. మీ బ్లాగు చూస్తుంటే షడ్రసోపేతమైన భోజనం తింటున్నట్లుంది. మళ్ళీ ధన్యవాదాలు మరొక సారి.
నమస్తే సార్__/\__
"మీ బ్లాగు షడ్రసోపేతమైన భోజనం ఆరగించినంత
ఆనందంగా వుందని"
చెప్పినందుకు చాలా చాలా థాంక్స్.
ఇకపోతే నాకు మీ అంత పరిజ్ఞానం లేదండీ:(
పాటలపై మక్కువతో ఈ బ్లాగు సౄష్టించడమైనది.
మీ లాంటి పెద్దవారు చెపితేకదా నాలాంటి వారికి
తప్పొప్పులు తెలిసేది, ఇలా మీరు నాపై కరుణతో
తప్పులు సరిదిద్దడం నా అద్రుష్టమని భావిస్తాను
ప్రేమతో
శక్తి
Post a Comment