Thursday, June 30, 2011

ప్రేమ జీవులు --- 1971





సంగీతం::విజయకృష్ణమూర్తి
రచన::సినారె
హానం::SP.బాలు

ఇది ఎన్నడు వీడని కౌగిలి
మనేదలను కలిపిన రాతిరి
విరబూసెను నేడే అనురాగం
కరుణించెను తానే ఆ దైవం

ఇది ఎన్నడు వీడని కౌగిలీ..ఈ..ఈ.....

కలువల మించిన నీ కనులు..చిలికెను నాలో వెన్నెలలు
చిగురులు మించిన నీ తనువు..చిందెను నాలో నవమధువు
అందాలన్నీ నీవేలే..అందాలన్నీ నీవేలే
అనుభవమంతా నాదేలే..

ఇది ఎన్నడు వీడని కౌగిలి
మనేదలను కలిపిన రాతిరి
విరబూసెను నేడే అనురాగం
కరుణించెను తానే ఆ దైవం
ఇది ఎన్నడు వీడని కౌగిలీ..ఈ..ఈ.....

కోవెలగంటల నాదంలో..జీవనగానం విందాము
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
తీరని వలపుల ఊయలలో..తీయని కలలే కందాము
ఒకరికొకరు నీడగా..ఒకరికొకరు నీడగా
ఉందాము దైవం తోడుగా

ఇది ఎన్నడు వీడని కౌగిలి
మనేదలను కలిపిన రాతిరి
విరబూసెను నేడే అనురాగం
కరుణించెను తానే ఆ దైవం
ఇది ఎన్నడు వీడని కౌగిలీ..ఈ..ఈ.....

No comments: