Monday, June 21, 2010

మంగళ తోరణాలు 1979





సంగీతం::రమేష్ నాయుడు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::SP.బాలు,సుశీల


ఏమయ్యిందంటే..
ఆ !
అయిందంటే..
ఏమయ్యిందంటే నే చెప్పలేను
ఏం కాలేదంటే నేనొప్పుకోనూ

ఏమయ్యిందంటే నే చెప్పలేను
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ

పదములేమో పద పద మంటుంటే..
బిడియమేమో బిడియ పడుతుంటే
నిలవని నా చేయి కలవర పడిపోయి
నిలవని నా చేయి కలవర పడిపోయి
కొసపైటతో గుసగుస లాడుతుంటే

హ హ హ.....ఆ పైన ?

ఏమయ్యిందంటే నే చెప్పలేను
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ
ఏమయ్యిందంటే నే చెప్పలేను
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ

వేచిన పానుపు విసుగుకోగా
వెలిగే పడకిల్లు మసకైపోగా
పెదవులు పొడివడి..మాటలు తడబడి
పెదవులు పొడివడి..మాటలు తడబడి
తనువులు తమే పలకరించుకోగా

హా.....ఆపైనా ?

హు..ఏమయ్యిందంటే నే చెప్పలేను
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ
ఏమయ్యిందంటే నే చెప్పలేను
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ

ఉదయకిరణాలు తలుపు తడుతుంటే
ఒదిగిన హౄదయాలు వదలమంటుంటే
వేళమించెనని పూలపాన్పు దిగీ
వేళమించెనని పూలపాన్పు దిగి
కదిలే నిన్ను కౌగిట పొదువుకుంటే

ఆపైనా ?

ఏమయ్యిందంటే..హు హు హూ హూ
ఏమీ కాలేదంటే..

లా ల ల లా ల..నే చెప్పలేనూ
హ హ హ లా లా ల లాల లాలా..నేనొప్పుకోనూ..

No comments: